![]() |
![]() |

హనీమూన్ హనీమూనే... హాబీలు హాబీలే! అలాగే, వ్యాపారం వ్యాపారమే! మాల్దీవులకు హనీమూన్ కోసం వెళ్లిన కాజల్... భర్తతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తూనే... మధ్యలో వ్యాపారానికి సంబంధించిన పనులు కూడా చెక్కబెడుతున్నారు. కొత్తగా కాజల్ ఒక కంపెనీలో షేర్లు కొన్నారు.
ముంబైకి చెందిన ఆన్లైన్ గేమింగ్ కంపెనీ ఓకీ (OKIE)లో కాజల్ అగర్వాల్ ఇన్వెస్ట్ చేశారు. ఎంత డబ్బులు పెట్టారనేది బయటకి చెప్పలేదు. కానీ, కంపెనీలో 15 శాతం వాటాను ఆమె కొనుగోలు చేశారు. ఇప్పుడు ఓకీ బోర్డు సభ్యుల్లో కాజల్ కూడా ఒకరు. ఆన్ లైన్ గేమింగ్ ఇండస్ట్రీ దేశంలో అభివృద్ధి చెందుతోందనీ, ఇందులో ప్రవేశించడానికి ఇదే సరైన సమయం అని అనుకుంటున్నానని కాజల్ చెప్పారు. గేమింగ్ ఇండస్ట్రీలో మహిళలను ప్రభావితం చేయగలనని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ప్రస్తుతం కాజల్ అగర్వాల్, ఆమె భర్త గౌతమ్ మాల్దీవుల్లోనే ఉన్నారు. కాజల్ కోసం ఆయన ఫోటోగ్రాఫర్ అవతారం ఎత్తారు. చందమామ లాంటి ఆమెను మరింత అందంగా కెమెరాలో బంధించారు.
![]() |
![]() |