![]() |
![]() |

'కేజీఎఫ్'తో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు కన్నడ కథానాయకుడు యష్. ప్రస్తుతం 'కేజీఎఫ్ ఛాప్టర్ 2'తో బిజీగా ఉన్నారు ఈ టాలెంటెడ్ స్టార్. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్లలో సందడి చేయనుందని సమాచారం. ఇదిలా ఉంటే.. త్వరలో యష్ ఓ భారీ మల్టిస్టారర్‌లో నటించే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ ప్రస్తుతం లోకనాయకుడు కమల్ హాసన్ తో 'ఇండియన్ 2'ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తరువాత ఆయన ఓ బడా మల్టిస్టారర్ ని ప్లాన్ చేశారని సమాచారం. అందులో యష్ మెయిన్ హీరోగా నటించే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మూవీలో ఎంతమంది హీరోలుంటారు, మిగతా హీరోలుగా ఎవరిని తీసుకుంటారనేది వెల్లడి కావాల్సి ఉంది. మరి.. యష్, శంకర్ కాంబినేషన్ మూవీ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |