![]() |
![]() |

శ్రీలంక లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో ఆయన క్యారెక్టర్‌ను పోషించేందుకు విజయ్ సేతుపతి సిద్ధమవుతున్నాడు. ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఆ విషయాన్ని సేతుపతి ప్రకటించాడు. కాగా మంగళవారం ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను మురళీధరన్, సేతుపతి సంయుక్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ వార్తను ఆ సినిమా పీఆర్ తన సోషల్ మీడియా పేజ్ ద్వారా వెల్లడించాడు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు స్టార్ స్పోర్ట్స్, స్టార్ స్పోర్ట్స్ తమిళ్ చానల్‌లలో విడుదల చేయనున్నారని అతను తెలిపాడు.
'800' టైటిల్‌తో రూపొందే ఈ సినిమాను ఎం.ఎస్. శ్రీపతి డైరెక్ట్ చేయనున్నాడు. శ్రీలం క్రికెట్ టీమ్ మెంబర్ కాకముందు మురళీధరన్ లైఫ్ ఎలా గడిచిందో కూడా ఈ సినిమాలో చూపించనున్నారని సమాచారం. ఒక బౌలర్‌గా విజయ్ సేతుపతి మంచి హావభావాలు ప్రదర్శించగలడని నమ్ముతున్నానని మురళీధరన్ చెప్పాడు. ఈ సినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో 800 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా మురళీధరన్ రికార్డ్ సృష్టించాడు. ఇప్పటిదాకా మరే బౌలర్ ఆ ఫీట్‌ను అందుకోలేదు.
కాగా మురళీధరన్ బయోపిక్ చేయవద్దంటూ విజయ్ సేతుపతిని కోయంబత్తూర్‌కు చెందిన ద్రవిడ సంస్థ టీపీడీకే డిమాండ్ చేసిన విషయం విదితమే. శ్రీలంక సివిల్ వార్‌లో తమిళులకు కాకుండా సింహళీయులకు సపోర్ట్ చేసిన మురళీధరన్ క్యారెక్టర్ చేస్తే, తమిళుల మనోభావాలు దెబ్బతింటాయని ఆ సంస్థ హెచ్చరించింది. అయితే విజయ్ సేతుపతి ఆ సంస్థ డిమాండ్‌ను పట్టించుకున్నట్లు లేదు.
![]() |
![]() |