![]() |
![]() |

ప్రభాస్ హీరోగా 'తానాజీ: ది అన్‌సంగ్ వారియర్' ఫేమ్ ఓమ్ రౌత్ 'ఆదిపురుష్' 3డి మూవీని రూపొందించేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో శ్రీరామునిగా ప్రభాస్ నటించనుండగా, రావణాసురుని పాత్రను బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కాగా ఇప్పుడు ఈ సినిమాలో కీలకమైన శివుని క్యారెక్టర్‌ను అజయ్ దేవ్‌గణ్ పోషించనున్నాడంటూ బాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
చివరాఖరుకు చెడుపై మంచి విజయం సాధిస్తుందనే పాయింట్‌పై నడిచే రామాయణ గాథ ఆధారంగా టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మించే ఈ భారీ బడ్జెట్ 3డి వెంచర్‌లో పరమేశ్వరుడి పాత్ర కోసం అజయ్ దేవ్‌గణ్‌ను సంప్రదించారని వినిపిస్తోంది. రావణాసురుడు శివ భక్తుడనే విషయం తెలిసిందే. పరమేశ్వరుని కోసం రావణుడు తీవ్ర తపస్సు చేసి, మానవుని చేతిలో తప్ప ఇంకెవరి చేతిలోనూ మరణం లేని వరాన్ని పొందాడనీ మనకు తెలుసు.
అలాంటి కథకు కీలకమైన పరమేశ్వరుని పాత్ర నిమిత్తం డైరెక్టర్ ఓమ్ రౌత్ ఇప్పటికే అజయ్ దేవ్‌గణ్‌ను కలిసి, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ పొందాడని బాలీవుడ్‌లో బలంగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై 'ఆదిపురుష్' టీమ్ ఇంకా నోరు మెదపలేదు. త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావచ్చని అంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నీ మూవీ 2021లో సెట్స్ మీదకు వెళ్లనున్నది.
![]() |
![]() |