![]() |
![]() |

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే కంగనా రనౌత్ తాజాగా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తన సినిమా 'తలైవి'కి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌ను షేర్ చేసుకుంది. అంతే కాదు, ఆ సినిమా సెట్స్ నుంచి స్టన్నింగ్ పిక్చర్స్‌ను సైతం ఆమె షేర్ చేసింది. ఆ పిక్చర్స్‌లో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రధారిగా ఆమె కనిపిస్తోంది.
ఇటీవల 'తలైవి' షూటింగ్‌ను పునఃప్రారంభించిన టీమ్, లేటెస్ట్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసింది. కంగన కలర్ ఫొటోలను కాకుండా బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను షేర్ చేయడం గమనార్హం. ఒక పిక్చర్‌లో కంగన జయలలిత మార్క్ శారీ ధరించి, స్వచ్ఛంగా నవ్వుతూ కనిపిస్తుంటే, మరో ఫొటోలో అసెంబ్లీ సమావేశాల్లో చైర్‌లో కూర్చొని ఉన్న ఫొటో. ఈ రెండో దానిలో ఆమె ముఖానికి మాస్క్ ధరించింది.
ఈ ఫొటోలను షేర్ చేసిన కంగన, "జయ అమ్మ బ్లెస్సింగ్స్‌తో మేం 'తలైవి - ద రివల్యూషనరీ లీడర్' మూవీ మరో షెడ్యూల్‌ను కంప్లీట్ చేశాం. కరోనా తర్వాత చాలా విషయాలు మారిపోయాయి కానీ యాక్షన్ మధ్య, కట్‌కు ముందు ఏమీ మారలేదు. థాంక్యూ టీమ్ విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్, ఎ.ఎల్. విజయ్" అని ట్వీట్ చేసింది.
.jpg)
ఎం.జి. రామచంద్రన్ క్యారెక్టర్‌ను అరవింద్ స్వామి పోసిస్తోన్న ఈ చిత్రానికి ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్నది.
![]() |
![]() |