![]() |
![]() |

ప్రతి ఏటా అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవం (ఇంటర్నేషనల్ గాళ్ చైల్డ్ డే)ను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ వస్తున్నారు. ఈ సందర్భంగా తన కుమార్తె సితారకు సూపర్‌స్టార్ మహేశ్ ఓ స్పెషల్ మెసేజ్ అందజేశాడు. సితార పుట్టినప్పట్నుంచీ సోషల్ మీడియా ద్వారా కానీ, ఇంటర్వ్యూల్లో కానీ ఆమెను తనెంతగా ప్రేమిస్తూ వస్తున్నాడో ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉన్నాడు మహేశ్. సితార పాడుతున్న, డాన్స్ చేస్తున్న, ఇంకే పని చేస్తున్నా వాటి వీడియోలను మహేశ్, అతని భార్య నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు.
ఆదివారం అందమైన భంగిమలో ఉన్న సితార ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన మహేశ్, "పాప కంటే గొప్ప కానుక ఏదీ లేదు. తనదైన శైలిలో తన సొంత చిన్ని ప్రపంచంలో ఏదో ఒకటి క్రియేట్ చేయడానికి ట్రై చేసే నా పాపను చూసి నేను గర్విస్తుంటాను. నీ కలలను విస్మరించొద్దు. నీ గొంతు విననివ్వు. దృఢంగా ఉండు. సరైనదనుకున్న నీదాని కోసం పోరాడు. మనం దీన్ని సమాన ప్రపంచంగా మారుద్దాం. నా లిటిల్ గాళ్‌ను, ఈ ప్రపంచంలోని అందరు చిన్నారి పాపలను సెలబ్రేట్ చేద్దాం.. #InternationalGirlChildDay.” అనే హృదయాన్ని ఆకట్టుకొనే అందమైన నోట్ రాశాడు.

మహేశ్, నమ్రత దంపతుల ఇద్దరు పిల్లల్లో చిన్నదైన సితార 2012లో పుట్టింది. కేవలం మహేశ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు సినీ ప్రియులంతా ఆమెను ఇష్టపడుతుంటారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు, తన ఫ్రెండ్ అయిన ఆద్యతో కలిసి సొంత యూట్యూబ్ చానల్ నడుపుతోంది సితార.
![]() |
![]() |