![]() |
![]() |

ఇప్పటి వరకూ తనకు కొవిడ్-19 సోకిందని బయటి ప్రపంచానికి వెల్లడించకుండా, హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ వచ్చిన మిల్కీ బ్యూటీ ఎట్టకేలకు సోషల్ మీడియా ద్వారా పెదవి విప్పింది. తనకు కొవిడ్ సోకిందనీ, ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అవుతున్నాననీ ఆమె వెల్లడించింది. ఇంట్లో స్వీయ ఐసోలేషన్‌లో ఉండబోతున్నట్లు తెలిపిన ఆమె, మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుంటాననే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. సోమవారం రాత్రి తన ట్విట్టర్ హ్యాండిల్లో ఈ మేరకు ఆమె ఓ నోట్ రాసింది.
"నా బృందం, నేను సెట్లో చాలా క్రమశిక్షణతో ఉన్నప్పటికీ, దురదృష్టవశాత్తు నేను గత వారం తేలికపాటి జ్వరానికి గురయ్యాను. తప్పనిసరి పరీక్షలు చేసిన తరువాత, నన్ను COVID-19 పాజిటివ్‌గా నిర్ధారించారు. ప్రతికూల ఆరోగ్య ఫలితాలను తగ్గించడానికి నేను హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాను. వైద్య నిపుణుల సంరక్షణలో ఉన్న తరువాత నేను ఇప్పుడు డిశ్చార్జ్ అవుతున్నాను. ఇది ఒక కఠినమైన వారం. కానీ నేను బాగున్నాననే భావిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని బాధపెడుతున్న ఈ మహమ్మారి నుండి పూర్తిగా కోలుకుంటాననే ఆశాభావంతో ఉన్నాను. ప్రస్తుతానికి, వైద్యుల సలహా మేరకు స్వీయ-ఐసోలేషన్‌లో ఉంటాను. వారి ప్రేమ, శ్రద్ధ, పాజిటివిటీ చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ పెద్ద వర్చువల్ హగ్ ఇస్తున్నాను. సురక్షితంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, బాగా ఉండండి!.. లవ్, తమన్నా" అంటూ రాసుకొచ్చింది తమన్నా.

ఇదివరకు ఆగస్ట్ 26 తన తల్లిదండ్రులిద్దరూ కొవిడ్-19 బారిన పడినట్లు ఆమె వెల్లడించిన విషయం తెలిసిందే. అప్పుడు నెగటివ్‌గా తేలిన తమన్నా.. కొద్ది రోజుల క్రితం మహమ్మారి వైరస్ బారిన పడింది.
![]() |
![]() |