![]() |
![]() |

ప్రభాస్ కథానాయకుడిగా నటించనున్న పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. బాలీవుడ్‌లో ‘తానాజీ’తో హిట్ అందుకున్న ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నారు. రామాయణం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాలో శ్రీరాముని పాత్రలో ప్రభాస్ నటించనున్నారు. ప్రభాస్‌కి జంటగా సీతాదేవి పాత్రలో అనుష్క నటించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే, వాటిలో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు.
సీతగా తాను నటించడం లేదనీ, ఆ చిత్రానికి సంబంధించి తనను ఎవరూ సంప్రదించలేదనీ అనుష్క అన్నారు. చర్చలు సైతం జరగలేదని చెప్పారు. తన దగ్గర అసలు ‘ఆదిపురుష్’ టాపిక్కే రాలేదని వెల్లడించారు. అందువల్ల, ‘ఆదిపురుష్’లో అనుష్క లేరన్నమాట.
‘నిశ్శబ్దం’ సినిమా గురించి అనుష్క మాట్లాడుతూ ‘‘డెఫ్ అండ్ డంబ్ (చెవిటి, మూగ) అమ్మాయి సాక్షి పాత్రలో నటించడం నాకు ఒక ఛాలెంజ్. ఆ పాత్ర కోసం రెండు నెలలు సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. తీరా చిత్రీకరణకు అమెరికా వెళ్లిన తర్వాత అక్కడ సైన్ లాంగ్వేజ్ మరో విధంగా ఉంటుందని తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాలను బట్టి సైన్ లాంగ్వేజ్ మారుతుందట. ‘నిశ్శబ్దం’ అమెరికా నేపథ్యంలో నడిచే కథ కావడంతో అమెరికన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను’’ అని తెలిపారు. ఇదొక థ్రిల్లర్ అని ఆమె అన్నారు. ఇప్పటివరకూ తాను నటించిన చిత్రాల కంటే ‘నిశ్శబ్దం’ డిఫరెంట్‌గా ఉంటుందని అనుష్క అన్నారు.
![]() |
![]() |