![]() |
![]() |

బిగ్ బాస్ హౌస్‌లోని గార్డెన్లో రిలాక్స్ అవుతున్నాడు అఖిల్. అతని ముందు స్వాతి దీక్షిత్, మోనాల్ కుర్చీల్లో కూర్చొని ఉన్నారు. "తూనీగ.. తూనీగా" అంటూ స్వాతి కూనిరాగం తీసింది. అఖిల్ గొంతు కలిపాడు. తనకు తెలుగు పాటలు రాకపోవడంతో మౌనంగా ఉంది మోనాల్.
"నాకు ఐలాండ్ అంటే చాలా ఇష్టం" అన్నాడు అఖిల్.
"అంటే.. మనుషుల్లేని ఐలాండ్!" మోనాల్ సెటైర్ వేసింది.
"ఐలాండ్ లో ప్రశాంతంగా గిటారు వాయించుకుంటా" అన్నాడు అఖిల్.
"ఎవరి కోసం?" స్వాతి ప్రశ్నించింది.
"ప్రకృతి కోసం." చెప్పాడు అఖిల్.
"నేను వెళ్తున్నాను" అంటూ కుర్చీలో నుంచి లేచింది మోనాల్.
"గిటార్ వచ్చా?" అఖిల్‌ను అడిగింది స్వాతి.
"నేర్చుకుంటా" జవాబిచ్చాడు అఖిల్.
"బిగ్ బాస్ తర్వాత బిజీ అయ్యే అఖిల్ షూటింగ్స్ మధ్యలో గిటారు వాయించుకుంటాడు" అని యాక్షన్ చేస్తూ అఖిల్ ను ఆటపట్టిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మోనాల్.
"ఇంకేం నేర్చుకుంటావు?" స్వాతి అడిగింది.
"ఇంత అందంగా ఎలా అయ్యారో.. స్కిన్ కేర్ కూడా నేర్చుకోవాలి" అన్నాడు అఖిల్.
"నా గురించా.. ఆల్ రెడీ జనాలు ఇంప్రెస్ అయ్యారు. ఇంకా ఎవరి కోసం?" అంది స్వాతి.
"ఇంప్రెస్ అయ్యారని ఆగిపోవద్దు కదా.. మనల్ని మనం డే బై డే డెవలప్ చేసుకోవాలి. డీవియేట్ కాకుండా మనం మనలాగే ఉండి డెవలప్ కావాలి" సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పాఠాలు చెప్పాడు అఖిల్.
"అఖిల్ అనుకునేది జరగాలి" క్లాప్స్ కొడుతూ స్వాతి విషెస్ చెప్పింది.
ఆ తర్వాత చాలాసేపు వారిద్దరూ తమతమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. చూస్తుంటే ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయినట్లే కనిపిస్తోంది. ఆ ఫ్రెండ్షిప్ ఏ రూపం తీసుకుంటుందో వెయిట్ అండ్ సీ...
![]() |
![]() |