![]() |
![]() |

సెలబ్రిటీలు, ముఖ్యంగా హీరోయిన్లకు ప్రేమ, పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు సోషల్ మీడియాలో తరచూ ఎదురవుతుంటాయి. కొందరు చిరునవ్వుతో తప్పిచుకుంటే... మరికొందరు సమయం వచ్చినప్పుడు చెబుతామని సమాధానం ఇస్తారు. ఇంకొందరు 'మీకెందుకు?' అని గట్టిగా కౌంటర్ ఇస్తారు. పునర్నవి భూపాలం కూడా అలాగే సమాధానం ఇచ్చారు.
'ఉయ్యాలా జంపాలా' సహా కొన్ని సినిమాల్లో నటించిన ఆమె గతేడాది 'బిగ్ బాస్ 3'లో సందడి చేశారు. అందులో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో సన్నిహితంగా మెలగడంతో ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని జనాలు భావించారు. ఫ్రెండ్షిప్ అని కొన్ని సందర్భాలలో చెప్పినా కొందరు నమ్మడం లేదు. మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పునర్నవి భూపాలం ప్రేక్షకులతో చాట్ చేశారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
.jpg)
"రాహుల్‌తో మీ రిలేషన్షిప్ ఏంటి?" అని ఒకరు ప్రశ్నించగా... "ప్రశ్నలు అడగమని చెప్పగానే ఈ ఎదవలు ఒక క్వశ్చన్ స్టార్ట్ చేస్తారు. నేను ఒకటే ఆన్సర్ ఇస్తా. మీది మీది కడుక్కోండి. ఓకే... వెళ్లొస్తా" అని పునర్నవి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ఇంకొంకరు ప్రశ్నించగా "మళ్లీ ఇదొక ప్రశ్న అడుగుతారు. దేనికి? నా పెళ్ళికి మీ అందరికీ వెడ్డింగ్ కార్డ్స్" అని సమాధానం ఇచ్చారు.
.jpg)
![]() |
![]() |