![]() |
![]() |

'మౌనరాగం', 'మనసు మమత' సీరియళ్లలో నటించిన శ్రావణి మంగళవారం అర్థరాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. స్నానాల గదిలోకి వెళ్లి ఆమె ఉరి వేసుకున్నారు. దేవరాజు రెడ్డి వేధింపులు భరించలేక తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నట్లు శ్రావణి కుటుంబం ఆరోపించింది. హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో అతడిపై కేసు పెట్టింది.
వివరాల్లోకి వెళితే... మధురానగర్ లో కుటుంబంతో కలిసి శ్రావణి ఉంటుంది. టిక్ టాక్ యాప్ ద్వారా పశ్చిమగోదావరి జిల్లా, గొల్లప్రోలు కు చెందిన దేవరాజు రెడ్డి తో ఆమెకు పరిచయమైంది. తర్వాత కాలంలో అది ప్రేమగా మారింది. కొన్ని రోజుల్లో సవ్యంగా ఉన్నప్పటికీ ఇటీవల ఆమె దేవరాజు వేధించడం మొదలు పెట్టాడని అందుకే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని శ్రావణి కుటుంబం అంటోంది.
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, హిందీ సీరియల్ యాక్టర్ మన్మీత్ గ్రేవాల్ కొన్ని నెలల క్రితమే ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకున్నారు. సెలబ్రిటీలు సూసైడ్ చేసుకోవడం ఈమధ్యకాలంలో ఎక్కువ అవుతుంది.
![]() |
![]() |