అల్లు అర్జున్ గతంలో 'ఐకాన్' టైటిల్‌తో సినిమా చేయడానికి అంగీకరించాడు. దిల్ రాజు ప్రొడక్షన్ కంపెనీలో శ్రీరామ్ వేణు ఆ సినిమాని డైరెక్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ టైటిల్ పాత్రధారిగా 'వకీల్ సాబ్'ను వేణు రూపొందిస్తున్న విషయం మనకు తెలుసు. ఆ మూవీ తర్వాత 'ఐకాన్' పట్టాలెక్కుతుందనే నమ్మకంతో వేణు ఉన్నాడు. ఈలోగా తన 21వ సినిమాని కొరటాల శివ డైరెక్ట్ చేస్తాడని బన్నీ ప్రకటించడంతో అతను షాక్ తిన్నాడు. అంటే 'ఐకాన్' అటక ఎక్కినట్లేనని అంతా అనుకుంటూ వస్తున్నారు.
అయితే శ్రీరామ్ వేణు తయారుచేసిన స్క్రిప్టును బన్నీ పక్కన పెట్టేసినా, దిల్ రాజు మాత్రం పక్కన పెట్టలేదని విశ్వసనీయ సమాచారం. క్లాసిక్ మూవీ 'ద మోటార్‌సైకిల్ డైరీస్' ఆధారంగా 'ఐకాన్' స్క్రిప్టును వేణు తయారుచేశాడంటున్నారు. రాజుకు అది బాగా నచ్చింది. అందుకని ఆ స్క్రిప్టును ఎలాగైనా తెరమీద చూడాలని ఆయన భావిస్తున్నాడు. రామ్‌చరణ్‌కు అది వినిపించాలని, అతను ఓకే అంటే వచ్చే ఏడాది దాన్ని సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారనీ ఫిల్మ్‌నగర్‌లో చెప్పుకుంటున్నారు.
చరణ్ ఇదివరకు దిల్ రాజు బ్యానర్లో 'ఎవడు' వంటి హిట్ మూవీని చేశాడు. అయితే ఇప్పటికే అతను 'ఛలో', 'భీష్మ' చిత్రాల దర్శకుడు వెంకీ కుడుమలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వినవస్తున్న తరుణంలో 'ఐకాన్'కు అతను ఓకే చెబుతాడా?