ఇండియన్ బాక్సాఫీస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'బాహుబలి' తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ 'సాహో'. ఆ చిత్రానికి సుజిత్ దర్శకుడు. అతడు ఇకపై బ్యాచిలర్ కాదు. ఆదివారం ఓ ఇంటివాడు అయ్యాడు.
కొన్ని రోజుల క్రితం సుజిత్, ప్రవల్లిక నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఆదివారం వివాహం జరిగింది. హైదరాబాద్ సిటీలో గల గోల్కొండ రిసార్ట్స్ లో పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. కరోనా ఎఫెక్ట్ వల్ల ఎక్కువమంది అతిథులను ఆహ్వానించలేదట. ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేశారట. సాధారణంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే సుజిత్... పెళ్లికి కూడా లో ప్రొఫైల్ మెయింటెన్ చేశాడు.