![]() |
![]() |

లేట్ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మర్డర్ బేస్ చేసుకుని బాలీవుడ్లో ‘సూసైడ్ ఆర్ మర్డర్’ అని ఓ సినిమా తెరకెక్కుతోంది. 'ఎ స్టార్ వాజ్ లాస్ట్'.... (ఓ స్టార్‌ని కోల్పోయాం) అనేది క్యాప్షన్. సుశాంత్ సూసైడ్ తరవాత బాలీవుడ్లో నెపోటిజమ్ డిస్కషన్ తీవ్రస్థాయిలో జరుగుతోంది. అదే సమయంలో నెపోటిజమ్ ఫ్లాగ్ బేరియర్ అని కంగనా రనౌత్ విమర్శించిన కరణ్ జోహార్‌పై విమర్శలు వెల్లువలా వచ్చాయి. అతడిని సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. ‘సూసైడ్ ఆర్ మర్డర్’లో కూడా కరణ్ జోహార్‌ని టార్గెట్ చేసినట్టు, అతడిని విలన్‌గా చూపిస్తున్నట్టు స్పష్టమైంది.
‘సూసైడ్ ఆర్ మర్డర్’లో విలన్‌గా మోడల్ రాణాను సెలక్ట్ చేశారు. అతడు చేయబోయే క్యారెక్టర్ పేరు నెపోకింగ్ అనీ, స్టార్ కిడ్స్‌ని లాంఛ్ చేసే బిగ్ షాట్ ఫిలిమ్ ప్రొడ్యూసర్ అనీ సినిమా యూనిట్ తెలిపింది. ఇన్‌డైరెక్టుగా కరణ్ జోహార్‌ని టార్గెట్ చేశారని ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా చెప్పారు. సుశాంత్‌కి డూప్‌లా ఉంటాడని సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న సచిన్ తివారీ ఈ సినిమా సుశాంత్ పాత్రలో నటిస్తున్నారు. ఆగస్టు తరవాత చిత్రీకరణ ప్రారంభించాలని అనుకుంటున్నారట.
![]() |
![]() |