![]() |
![]() |

బాలీవుడ్ ఫర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'లాల్ సింగ్ చడ్ఢా' షూటింగ్ కొవిడ్-19 వ్యాప్తి కారణంగా ఆగిపోయింది. ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ ఎక్కువగా నార్త్ ఇండియా కాబట్టి అక్కడి లొకేషన్లలోనే షూటింగ్‌ను పునరుద్ధరించవచ్చని ఎవరైనా అనుకోవచ్చు. కానీ కమర్షియల్‌గా అది తెలివైన నిర్ణయం అనిపించుకోదు. ఎందుకంటే నార్త్‌లో కరోనా విలయ తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. కాబట్టి, అనుకున్నట్లు జరిగితే, టర్కీ, జార్జియా దేశాల్లో మిగతా షూటింగ్ జరిగే అవకాశాలున్నాయి. అక్కడ కథానుగుణమైన సెట్లు వేసి, వాటిలో షూటింగ్ జరపాలని ఆమిర్ అండ్ కో భావిస్తున్నారు. ఈ రెండు దేశాలు కొవిడ్-19ని కంట్రోల్ చేయడంలో విజయం సాధించాయి. పైగా ఆ రెండు దేశాల మధ్య దూరం రెండు గంటల విమాన ప్రయాణమే.
"కొంత కాలంగా షూటింగ్ పునరుద్ధరించేందుకు అటు ఆమిర్, ఇటు డైరెక్టర్ అద్వైత్ చందన్ వెయిట్ చేస్తున్నారు. నాలుగు నెలలుగా కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. 'లాల్ సింగ్ చడ్ఢా' లాంటి బిగ్ కాన్వాస్ ఫిల్మ్ కోసం ఇంకా ఎంకెంత కాలం వెయిట్ చేయాలి? అందుకే జార్జియా, టర్కీలలో షూటింగ్‌కు వాళ్లు ప్లాన్ చేస్తున్నారు" అని యూనిట్ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఈ మూవీని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న రిలీజ్ చేయాలని ఇదివరకు నిర్ణయించారు. ఇంకా 35 శాతం షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న పరిస్థితుల్లో ఆ తేదీకి సినిమా విడుదలయ్యే పరిస్థితి లేదు. అయినప్పటికీ వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసి, రిలీజ్‌కు రెడీ చేయాలని ఆమిర్ భావిస్తున్నాడు.
![]() |
![]() |