![]() |
![]() |

అల్లు అరవింద్ ఆధ్వర్యంలో నడుస్తున్న అచ్చ తెలుగు ఓటీటీ 'ఆహా', మిగతా ఓటీటీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టు కొత్త సినిమాలను ఆహా కొంటోంది. ఇటీవల 'భానుమతి అండ్ రామకృష్ణ' సినిమాను ఎక్స్‌క్లూజివ్‌గా రిలీజ్ చేశారు. 'కృష్ణ అండ్ హిజ్ లీల'ను విడుదల చేశారు. స్టార్ హీరోయిన్లతో షోలు, వెబ్ సిరీస్ లు ప్లాన్ చేస్తున్నారు. అలాగే, చిన్న సినిమాలను కొంటున్నారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... తేజ మార్ని దర్శకత్వం వహించిన 'జోహార్' ఎక్స్‌క్లూజివ్ స్ట్రీమింగ్ రైట్స్ 'ఆహా' సొంతం చేసుకుంది.
తాజా రాజకీయ, సాంఘిక పరిణామాలని ఎత్తి చూపుతూ, విగ్రహ రాజకీయం కాళ్ళ కింద నలిగిపోయిన ఐదు జీవితాల కథనాలే ఇతివృత్తంగా 'జోహార్' తెరకెక్కింది. ఇదొక పొలిటికల్ సెటైర్. రామ్ గోపాల్ వర్మ దగ్గర 'వంగవీటి' చిత్రానికి దర్శకత్వ శాఖలో, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ దగ్గర పలు చిత్రాలకు రచనా విభాగంలో దర్శకుడు తేజ మార్ని పని చేశాడు. ఆల్రెడీ రిలీజ్ అయిన ఫస్ట్ లుక్‌కి రెస్పాన్స్ బాగా వచ్చింది.
![]() |
![]() |