![]() |
![]() |

తనను తాను మొండిఘటంగా జయప్రద అభివర్ణించుకున్నారు. అంతే కాదు... తాను ఏ పనినైనా చాలా అకింతభావంతో, నిబద్ధతగా చేస్తానని చెప్పుకొచ్చారు. అకింతభావం, మొండితనం, నిబద్ధత మహిళకు ఉంటే చాలామంది మైనస్ అనుకుంటారనీ, తాను మాత్రం భగవంతుడి ఆశీర్వాదంగా భావిస్తానని జయప్రద తెలిపారు.
కథానాయికగా, నటిగా వెండితెరపై ఓ వెలుగు వెలిగిన జయప్రద... రాజకీయాలలోనూ తనదైన ముద్ర వేశారు. ఆమె జీవితంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. రాజకీయాల్లో పలు సవాళ్ళను ఎదుర్కొన్నారామె. జీవితంలో ఎన్నో విజయాలు, విమర్శలు చూసిన జయప్రద... ప్రస్తుతం ఓ పుస్తకం త్వరలో తన ఆత్మకథ రాయాలనుకుంటున్నట్టు చెప్పారు. ఎవరైనా స్ట్రాంగ్ మహిళకు రచనా బాధ్యతలు అప్పగిస్తానని ఆమె అన్నారు. మహిళా అయితేనే తన బయోగ్రఫీకి న్యాయం చేస్తుందని జయప్రద వ్యాఖ్యానించారు. ఆల్రెడీ సావిత్రి జీవితకథ ఆధారంగా 'మహానటి' సినిమా వచ్చింది. జయప్రద ఆటోబయోగ్రఫీ రాస్తే... దాన్ని ఎవరో ఒకరు సినిమాగా తీస్తారని చెప్పడంలో సందేహాలు అవసరం లేదు.
![]() |
![]() |