![]() |
![]() |

మరో మలయాళ సినిమాపై విశ్వక్ సేన్ మనసు పడ్డాడట. హీరోగా అతడు చేసిన సినిమాలు తక్కువే. జస్ట్ నాలుగు సినిమాలు చేశాడు. అందులో ఒకటి మలయాళ రీమేక్. మలయాళంలో విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకుని మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న 'అంగమలై డైరీస్' ఆధారంగా 'ఫలక్ నుమా దాస్' తీశాడు విశ్వక్ సేన్. అందులో హీరోగా నటించడంతో పాటు డైరెక్షన్ చేశాడు. అతడికి అది మంచి పేరు తీసుకొచ్చింది. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... మరో మలయాళ సినిమా రీమేక్‌లో విశ్వక్ యాక్ట్ చేసే ఛాన్సులు ఉన్నాయి.
లాక్‌డౌన్‌కి ముందు విడుదలైన మలయాళ సినిమాల్లో 'కప్పెల్లా'కి మంచి టాక్ వచ్చింది. ఆ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ సితార ఎంటర్టైన్మెంట్స్ తీసుకుంది. విశ్వక్ సేన్ హీరోగా రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మలయాళంలో శ్రీనాథ్ భాసి పోషించిన షార్ట్ టెంపర్ యువకుడి పాత్ర కోసం 'హిట్' హీరోని అనుకుంటున్నారట. అదీ సంగతి. మిగతా కాస్ట్ అండ్ క్యూ డీటెయిల్స్ ఫైనలైజ్ కాలేదు. హీరో ఓకే అంటే తరవాత మిగతావి ఫైనలైజ్ చేయాలని అనుకుంటున్నారు.
![]() |
![]() |