![]() |
![]() |

బాలీవుడ్‌లో కామెడీ లెజెండ్‌గా పేరుపొందిన జగదీప్ కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర కాంబినేషన్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ 'షోలో'లో సూర్మ భూపాలీగా ఆయన అభినయం ఇప్పటికీ కళ్లముందు మెదులుతూనే ఉంటుంది. ఆయన మృతికి కారణమేంటనేది ఇంకా వెల్లడి కాలేదు.
'అబ్ దిల్లీ దూర్ నహీ', కేఏ అబ్బాస్ 'మున్నా', గురుదత్ 'ఆర్ పార్', బిమల్ రాయ్ 'దో బిఘా జమీన్', ఏవీయం 'హమ్ పాంచీ ఏక్ దాల్ కే' వంటి సినిమాలతో కెరీర్ ఆరంభించిన జగదీప్ తన కెరీర్‌లో 400కు పైగా సినిమాల్లో నటించారు. 'హమ్ పాంచీ ఏక్ దాల్ కే' మూవీలో జగదీప్ అద్భుత అభినయానికి అచ్చెరువొందిన అప్పటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఆయనకు తన వ్యక్తిగత సిబ్బందిని కానుకగా ఇచ్చారని చెప్పుకుంటారు.
జగదీప్ చివరిసారిగగా 'గలీ గలీ చోర్ హై' సినిమాలో కనిపించారు. అక్షయ్ ఖన్నా, శ్రియ, ముగ్ధా గాడ్సే ప్రధాన పాత్రధారులైన ఆ సినిమా 2012 ఫిబ్రవరిలో విడుదలైంది. కాగా జగదీప్ మృతి పట్ల బాలీవుడ్ ఘనంగా నివాళులర్పిస్తోంది.
![]() |
![]() |