![]() |
![]() |
.jpg)
టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ పొందకపోయినా, బాలీవుడ్‌కు వెళ్లి స్టార్ హీరోయిన్‌గా ఎదిగి, లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్‌తో హల్‌చల్ చేస్తోన్న తార తాప్పీ పన్ను. లేటెస్ట్‌గా తనకు వచ్చిన ఎలక్ట్రిసిటీ బిల్లు చూసి ఆమె కళ్లు తేలేసింది. ముంబైలో ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు ఏప్రిల్ నెల బిల్లు రూ. 4390, మే నెల బిల్లు రూ. 3850 రాగా, జూన్ నెల బిల్లు ఏకంగా రూ. 36000 వచ్చింది. అది చూసి ఆశ్చర్యపోయిన ఆమె, ఆ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడి చేసింది. "మూడు నెలలు లాక్‌డౌన్‌లో ఉండగా, అపార్ట్‌మెంట్‌లో కొత్తగా ఏమేం వస్తువులు ఉపయోగించాను, లేదా కొన్నాను అని ఆశ్చర్యపోయాను. కేవలం పోయిన నెలలో నా ఎలక్ట్రిసిటీ బిల్లులో ఈ భయంకర పెరుగుదల కనిపించింది. అదానీ ఎలక్ట్రిసిటీ (ముంబై).. మీరు మాకు ఎలాంటి పవర్‌ను చార్జ్ చేస్తున్నారు?" అని ఆమె ప్రశ్నించింది.
అంతేనా.. అదానీ ఎలక్ట్రిసిటీ వాళ్ల లీలలు ఇంకా ఉన్నాయి. ఖాళీగా ఉన్న తాప్సీకి చెందిన మరో అపార్ట్‌మెంట్ కరెంట్ బిల్లు విషయంలోనూ వాళ్లు ఇలాంటి బిత్తరపోయే బిల్లునే వేశారు. మార్చిలో రూ. 570, ఏప్రిల్‌లో రూ. 730 బిల్లు వేసిన వాళ్లు మే నెల బిల్లుకు రూ. 8640 చార్జ్ వేశారు. "ఆ అపార్ట్‌మెంట్‌కు వారానికోసారి శుభ్రం చేయడానికి మాత్రమే అక్కడికి వెళ్తుంటాను. ఈ బిల్లు చూశాక మాకు తెలీకుండా ఆ అపార్ట్‌మెంట్‌ను ఎవరైనా ఉపయోగించుకుంటున్నారా, ఆ వాస్తవాన్ని తెలియజేయడంలో మీకు సాయపడ్డారా? అని ఆశ్చర్యంగా ఉంది" అని ట్వీట్ చేసింది.
తాప్సీకి ఇప్పుడే ఎలక్ట్రిసిటీ శాఖల లీలల మహత్యం ఎరుకైనట్లుంది. ఇలాంటి లీలలు ఇప్పటికి ఎంతమందికి ఎదురయ్యారో నిత్యం మనం వార్తల్లో చూస్తునే ఉన్నాం కదా!!

![]() |
![]() |