Home  »  News  »  ‘స్టూడెంట్’ స్టార్స్.. పాన్ ఇండియా అటెంప్ట్స్‌!

Updated : Jun 28, 2020

 

బాలీవుడ్ భామల టాలీవుడ్ ఎంట్రీకి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ బెస్ట్ ప్లాట్‌ఫామ్స్‌గా నిలుస్తున్నాయి. గత ఏడాది ‘సాహో’తో ఉత్తరాది భామ శ్రద్ధా కపూర్ ఇలానే సందడి చేయ‌గా.. ఇప్పుడు ఈ కోవలోనే మరో ఇద్దరు బాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు పాన్ ఇండియా మూవీస్‌తో తెలుగు చిత్రసీమ బాటపడుతున్నారు. ఆ ఇద్దరూ మరెవరో కాదు.. అలియా భట్, అనన్యా పాండే. ‘ఆర్ ఆర్ ఆర్’తో అలియా భట్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ (వర్కింగ్ టైటిల్)తో అనన్యా పాండే తెలుగుతెరకు పరిచయం కాబోతోంది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ ఇద్దరు నాయికలకు కొన్ని కామన్ ఫ్యాక్ట‌ర్స్ ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ (2012)తో అలియా భట్ హీరోయిన్‌గా తొలి అడుగేస్తే.. ఆ సినిమాకి సీక్వెల్‌గా రూపొందిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ (2019)తో అనన్యా పాండే తెరంగేట్రం చేసింది. అలాగే, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేశ్ భట్ వారసురాలిగా అలియా సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేస్తే.. ప్రముఖ బాలీవుడ్ నటుడు చంకీ పాండే వారసురాలిగా అనన్యా పాండే వెండితెరకు పరిచయమైంది. ఇలా.. ఈ ఇద్దరి ముద్దుగుమ్మలకి కూడా ‘స్టూడెంట్’ కనెక్షన్ ఉండడంతో పాటు.. వారసత్వం అనే కామన్ ఫ్యాక్టర్ కూడా ఉంది. అదే విధంగా.. ఈ ఇద్దరు కూడా స్టార్ డైరెక్టర్ల సినిమాలతోనే, అది కూడా పాన్ ఇండియా మూవీస్‌తోనే తెలుగు చిత్రసీమకు పరిచయమవుతున్నారు. అలియా భట్ తొలి చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’ని డైరెక్టర్ నంబర్ వన్ రాజమౌళి తెరకెక్కిస్తుండగా.. అనన్యా పాండే ఫస్ట్ టాలీవుడ్ వెంచర్ ‘ఫైటర్’ని ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్నాడు.

మరి.. పలు కామన్ ఫ్యాక్టర్స్‌తో తెలుగుతెరపై తొలి అడుగులేస్తున్న ఈ ‘స్టూడెంట్’ స్టార్స్‌కి ఆయా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఏ మేరకు ప్లస్ అవుతాయో చూడాలి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.