![]() |
![]() |

వరుణ్ తేజ్ టైటిల్ రోల్‌లో 'బాక్సర్' అనే మూవీ రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా కిరణ్ కొర్రపాటి డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా తయారవుతున్న ఈ సినిమా కోసం యు.ఎస్.లో బాక్సింగ్‌లో ట్రైనింగ్ తీసుకొని వచ్చాడు వరుణ్. కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధంలో భాగంగా షూటింగ్‌లు నిలిపి వేయడానికి ముందు ఈ చిత్రానికి సంబంధించి ఒక షెడ్యూల్ షూటింగ్ జరిగింది. ఇందులో వరుణ్ పాల్గొన్న కొన్ని సీన్లు తీశారు.
కాగా వచ్చే నెలాఖరులో 'బాక్సర్' షూటింగ్‌ను రెజ్యూమ్ చేయడానికి నిర్మాతలు అల్లు వెంకటేశ్, సిద్ధు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. మొదట క్యారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొనే సన్నివేశాలను తీస్తారని సమాచారం. అంటే వరుణ్ ఇప్పుడప్పుడే ఈ సినిమా సెట్స్ మీదకు రాడంట. సెప్టెంబర్‌లో అతను సెట్స్ మీదకు వస్తాడనీ, అప్పుడే అతనికి సంబంధించిన సన్నివేశాలను తీస్తారని వినిపిస్తోంది. హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన 'గద్దలకొండ గణేష్'లో మిడిల్ ఏజ్డ్‌లో ఉండే టైటిల్ రోల్‌ను సూపర్బ్‌గా పర్ఫార్మ్ చేసి ఇటు ప్రేక్షకాదరణను, అటు విమర్శకుల ప్రశంసల్నీ పొందిన వరుణ్, 'బాక్సర్' క్యారెక్టర్‌ను పోషించడం కోసం బాగా శ్రమిస్తున్నాడు. బాడీని దృఢంగా మార్చేశాడు. కండలు పెంచాడు. గడ్డం పొడవుగా పెంచాడు.
'బాక్సర్' సినిమా వరుణ్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని నాగబాబు అంటున్నారు. మాస్‌లో ఈ సినిమాతో మంచి ఇమేజ్ సంపాదించుకుంటాడని ఆయన చెప్పారు. డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి ఈ సినిమా స్క్రిప్టును, వరుణ్ క్యారెక్టర్‌ను అత్యంత ఆసక్తికరంగా మలిచాడని యూనిట్ వర్గాల భోగట్టా.
![]() |
![]() |