![]() |
![]() |

నందమూరి కళ్యాణ్ రామ్ ఓ కొత్త కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ, ప్రయోగాలు చేసే యువ దర్శకుడితో సినిమా చేయనున్నారని టాలీవుడ్ టాక్. యంగ్ హీరో నిఖిల్‌తో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', మాస్ మహారాజ్ రవితేజ హీరోగా 'డిస్కో రాజా' సినిమాలు తీసిన దర్శకుడు విఐ ఆనంద్ ఉన్నాడు కదా! అతడితో కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేయనున్నాడు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. కరోనా కలకలం తగ్గిన తరవాత, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తరవాత షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్, విఐ ఆనంద్ కాంబినేషన్లో ఇదే ఫస్ట్ సినిమా. 'డిస్కో రాజా' తరవాత దర్శకుడు చేస్తున్న సినిమా కూడా ఇదే. దీనికంటే ముందు మరో దర్శకుడితో హీరో ఓ సినిమా చేయాల్సి ఉంది. కళ్యాణ్ రామ్ హీరోగా హిట్ సినిమా '118' ప్రొడ్యూస్ చేసిన మహేష్ కోనేరు, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ సినిమా ప్రొడ్యూస్ చేయనున్నారు. విఐ ఆనంద్ గత సినిమాల తరహాలో ఈ సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో కొత్తగా ఉంటుందట.
![]() |
![]() |