![]() |
![]() |

సూపర్‌స్టార్ మహేష్‌బాబు కథానాయకుడిగా నటించనున్న కొత్త సినిమా 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకుడు. ఆల్రెడీ స్టోరీలైన్, స్క్రిప్ట్ లాక్ చేశారు. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. ఈ సినిమా కోసం బ్యాంక్ సెట్ వేయడానికి రెడీ అవుతున్నారు.
బ్యాంకుల్లో కోట్లకు కోట్ల రూపాయల లోన్లు తీసుకుని ఫారిన్ చెక్కేసిన విజయ్ మాల్యా టైప్ విలన్స్ ను వెనక్కి తీసుకు వచ్చే క్యారెక్టర్లో మహేష్ బాబు ఈ సినిమాలో చేస్తున్నాడు. బ్యాంక్ బ్యాక్ డ్రాప్ సీన్స్ సినిమాలో ఉన్నాయి. అవి షూట్ చేయడానికి ఒక బ్యాంక్ సెట్ వేయాలని డిసైడ్ అయ్యారు.
గీత గోవిందం తరువాత పరశురాం దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సెప్టెంబర్ నుండి షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఒకవేళ కరోనా కేసులు పెరిగితే షూటింగ్ పోస్ట్ పోన్ చేసి ఛాన్సెస్ ఉన్నాయి.
![]() |
![]() |