![]() |
![]() |

మోడల్, ఫ్యాషన్ డిజైనర్‌గా పేరుపొందిన హైదరాబాద్‌కు చెందిన ఒక సోషలైట్ తను, తన భర్త కరోనా పాజిటివ్ అంటూ నాలుగు రోజుల క్రితం తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించడంతో సినీ, రాజకీయ రంగాల వారు ఉలిక్కిపడ్డారు. ఆమె సన్నిహితుల్లో ఒక ప్రముఖ సినీ కుటుంబం కూడా ఉంది. ఆ ఇంటి కోడలైన పేరుపొందిన తార సదరు సోషలైట్‌ను ముద్దు పెట్టుకుంటున్న ఫొటోను ఆమె అంతకు మూడు రోజుల క్రితమే షేర్ చేసింది. దాంతో ఆ తార అభిమానులు ఆందోళనలో పడ్డారు. ఇంతదాకా తను కానీ, తన కుటుంబం కానీ కరోనా టెస్ట్‌లు చేయించుకున్నదీ, లేనిదీ ఆ తార వెల్లడించలేదు. దాంతో ఆమెకి కూడా కరోనా సోకి ఉంటుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అయినా ఆమె స్పందించలేదు.
ఇప్పుడు సినీ వర్గాల్లో ఆ సోషలైట్‌కు సంబంధించిన ఒక విషయం అంతర్గతంగా చక్కర్లు కొడుతోంది. ఆమె కుటుంబం ఇటీవల ఒక పార్టీ ఇచ్చిందనీ, ఆ పార్టీకి కొంతమంది సినీ, పొలిటికల్ సెలబ్రిటీలు అటెండ్ అయ్యారనీ, సోషలైట్‌కు కరోనా పాజిటివ్ అని స్పష్టమవడంతో, వాళ్లంతా ఆందోళనలో పడ్డారనేదే ఆ విషయం. అయితే ఈ వ్యవహారం బయటపడకుండా అందరూ గుంభనంగా ఉంటున్నారని వినిపిస్తోంది. లాక్‌డౌన్ పీరియడ్‌లోనూ ఉన్నత స్థాయి వర్గాల వారి ఇళ్లల్లో, ఫామ్‌హౌస్‌లలో పార్టీలు జరుగుతూనే ఉన్నాయనీ, వాటికి సెలబ్రిటీలు, సోషలైట్లు అటెండ్ అవుతూనే ఉన్నారనీ సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. తమను కరోనా ఏం చేయలేదనే భరోసానో లేక, అసలు దాన్ని ఏమాత్రం లెక్కలోకి తీసుకోకుండానో వారు పార్టీలు, ఫంక్షన్లు చేసుకుంటూనే ఉంటున్నారని ఆ వర్గాలు అంటున్నాయి.
ఇదే తరహాలో కోవిడ్ 19 పాజిటివ్‌గా తేలిన సోషలైట్ ఇంట్లోనూ పార్టీ జరిగిందనీ, కానీ దాన్ని బయటపెట్టడం లేదనీ చెప్పుకుంటున్నారు. ఆ పార్టీకి ఎవరెవరు హాజరయ్యారు, వాళ్లు కోవిడ్ టెస్ట్‌లు చేసుకున్నారా, లేదా అనే విషయం బయటపడితే మరిన్ని కోవిడ్ పాజిటివ్ కేసులు బయటపడొచ్చని వినిపిస్తోంది. సినీ కుటుంబం కోడలు తాను యోగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఫొటోలను షేర్ చేస్తోంది కానీ, అసలు విషయంపై రెస్పాండ్ కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
![]() |
![]() |