![]() |
![]() |

టీవీ యాక్టర్స్, టెక్నీషియన్స్‌లో కరోనా కలవరం మొదలైంది. రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నాయి. దాంతో షూటింగులు మొదలైన రెండు మూడు రోజులకు అడ్డుకట్ట పడుతోంది. 'సూర్యకాంతం', 'మట్టిగాజులు' సీరియల్స్ యాక్టర్ ప్రభాకర్‌కి కరోనా రావడంతో రెండు రోజులు సీరియల్స్ షూటింగులు క్యాన్సిల్ చేశారు. కరోనా నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, విధి విధానాలను రూపొందించారు.
'సూర్యకాంతం', 'మట్టిగాజులు' యాక్టర్ ప్రభాకర్‌తో సన్నిహితంగా మెలిగిన 'గృహలక్ష్మి' సీరియల్ హీరో హరికృష్ణకు అనుమానం వచ్చి టెస్టులు చేయించుకోగా, కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆ సీరియల్ షూటింగ్ క్యాన్సిల్ చేశారు. యూనిట్ సభ్యులు అందరికీ కరోనా టెస్టులు చేయించిన తరవాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. అలాగే, ప్రభాకర్‌తో కాంటాక్ట్ అయిన నటీనటులు, టెక్నీషియన్స్‌కి కరోనా టెస్టులు చేయిస్తున్నారని తెలిసింది.
![]() |
![]() |