![]() |
![]() |

నయనతార, ఆమె బాయ్‌ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ కోవిడ్ 19 పాజిటివ్‌గా వెల్లడైందంటూ నాలుగైదు రోజులుగా ఆన్‌లైన్‌లో బాగా ప్రచారంలోకి వచ్చింది. ఫలితంగా ఆ ఇద్దరూ చెన్నైలోని ఎగ్మోర్ క్వారంటైన్‌లో ఉంటున్నారని కూడా కొన్ని మీడియా సంస్థలు రాశాయి. దీనిపై వెరైటీగా స్పందించాడు విఘ్నేశ్. నయనతార, అతడు పిల్లల రూపాల్లో పిల్లల పాట బేబీ షార్క్‌ను పాడుతున్నట్లుగా ఫేస్‌యాప్ ఫిల్టర్‌ను ఉపయోగించి ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ ద్వారా తాము కరోనా పాజిటివ్ కాదంటూ స్పష్టం చేశాడు.
"మా గురించిన ఆ న్యూస్‌ను, మా మీద కరోనా ఊహల్ని అల్లిన ప్రెస్, సోషల్ మీడియా స్వీట్‌హార్ట్స్‌ను మేమెలా చూస్తున్నామనే దాన్ని ఈ వీడియో చూపిస్తుంది. ఏదేమైనా.. మేం హ్యాపీగా, హెల్దీగా ఉన్నామని మా శ్రేయోభిలాషులకు తెలియజేస్తున్నాం" అని అతను పోస్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా తమపై తప్పుడు ప్రచారం చేసిన కొన్ని మీడియా సంస్థలపై సెటైరికల్‌గా, "మిమ్మల్ని జోకర్లుగా చూడ్డానికి, మీ జోకుల్ని చూడ్డానికి దేవుడు మాకు తగినంత శక్తినీ, సంతోషాన్నీ ఇచ్చాడు" అని రాశాడు.
దాని తర్వాత, సోషల్ మీడియాలో తమ అభిమానుల కోసం నయనతార, తను కలిసున్న ఒక త్రోబ్యాక్ ఫొటోను షేర్ చేశాడు. అందులో కేబుల్ బ్రిడ్జి మీద నిల్చున్న నయనతార నుదుటిపై ముద్దు పెట్టుకుంటున్నాడు విఘ్నేశ్. ఆ ఫొటోకు ఎలాంటి కామెంట్ పెట్టకుండా కొన్ని హార్ట్ ఎమోజీలను జోడించాడు.
![]() |
![]() |