![]() |
![]() |

మధుబాబు రాసిన షాడో సిరీస్ నవలలు ఎంత పాపులరో ఒక తరానికి బాగా తెలుసు. మార్కెట్లో షాడో కొత్త నవల వచ్చిందంటే చాలు.. హాట్ కేక్‌లా అమ్ముడవ్వాల్సిందే. 1980, 90 దశకాల్లో యూత్‌కు షాడో ఆరాధ్య క్యారెక్టర్. షాడో షాడో, షాడో ఇన్ జపాన్, డాగర్ ఆఫ్ షాడో, షాడో ది స్పై కింగ్, డియర్ షాడో వంటి అనేకానేక షాడో నవలలను పాఠకులు విపరీతంగా చదివేవారు. అమెరికాలో జేమ్స్‌బాండ్ ఎంత పాపులరో, మన దగ్గర షాడో అంత పాపులర్. అలాంటి ఆ నవలలు, షాడో క్యారెక్టర్ వెబ్ సిరీస్ రూపొలో త్వరలో మన ముందుకు రాబోతున్నాయి.
ఇంతదాకా సినిమాలు తీస్తూ వస్తున్న అనిల్ సుంకరకు చెందిన ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పైకి అడుగుపెడుతూ, షాడో క్యారెక్టర్‌ను విజువల్‌గా మనముందు ప్రెజెంట్ చేయాలని నిర్ణయించుకుంది. రైటర్ మధుబాబు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని శుక్రవారం ఓ ప్రకటనలో ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. ఇంటర్నేషనల్ సిరీస్ స్థాయిలో ఈ సిరీస్‌ను అత్యంత క్వాలిటీతో నిర్మిస్తామని అది తెలిపింది. షాడోగా ఎవరు నటిస్తారు, ఈ సిరీస్‌ను ఎవరు డైరెక్ట్ చేస్తారు, స్క్రీన్‌ప్లే ఎవరు సమకూరుస్తారనే విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
![]() |
![]() |