![]() |
![]() |

లాక్‌డౌన్ ఎత్తేశాక డేట్స్ సమస్య ఎదురవడంతో యస్.యస్. రాజమౌళి మూవీ 'ఆర్ఆర్ఆర్' నుంచి తప్పుకోవాలని అలియా భట్ నిర్ణయించుకుందంటూ కొన్ని గాసిప్ వెబ్‌సైట్స్ రాసిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని అలియా సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆ ప్రచారంలో సినీ ప్రియుల్ని ఆ వెబ్‌సైట్లు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆ వర్గాలు అంటున్నాయి.
"ఆ ప్రచారం ఎక్కడ్నుంచి వచ్చింది? రాజమౌళి సినిమాలో అలియాను తొలగించారనే ప్రచారం కంటే గొప్ప ప్రచారం ఇంకేదీ ఉండదనుకున్న వాళ్లే దాన్ని సృష్టించి ఉంటారు. నిజానికి డేట్స్‌ను వర్కవుట్ చేయడానికి లాక్‌డౌన్ ముగియడం కోసం అలియా ఎదురుచూస్తోంది. రాజమౌళి, ఆమె ఒకరితో ఒకరు ఫోన్‌లో మాట్లాడుకుంటూనే ఉన్నారు. వీలైనంత త్వరలో షూటింగ్‌ను కంటిన్యూ చేయడానికి ఉన్న అవకాశాల కోసం వారు ఎదురుచూస్తున్నారు" అని ఆ వర్గాలు తెలిపాయి.
లాక్‌డౌన్ మొదలయ్యే సమయానికి అలియా మూడు సినిమాలు చేస్తోంది. అవి.. 'ఆర్ఆర్ఆర్', సంజయ్ లీలా భన్సాలీ సినిమా 'గంగూబాయ్ కథైవాడి', మహేశ్ భట్ మూవీ 'సడక్ 2'. షూటింగ్స్ కంటిన్యూ అవడం మొదలవగానే సెట్స్ మీదకు వెళ్లడానికి రెడీగా ఉంది అలియా.
![]() |
![]() |