![]() |
![]() |

టిక్‌టాక్ స్టార్‌గా పాపులర్ అయిన సియా కక్కర్ ఆత్మహత్య చేసుకుంది. ఆమె వయసు కేవలం 16 సంవత్సరాలు. ఈ విషయాన్ని పాపులర్ ఫొటోగ్రాఫర్ విరాళ్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించాడు. ఆ ముందు రోజు రాత్రే తను సియా మేనేజర్ అర్జున్ సరీన్‌తో ఒక సాంగ్ చేసే విషయమై మాట్లాడానని తను మాట్లాడానని విరాళ్ ఆ పోస్ట్‌లో చెప్పాడు. అప్పుడు సియా చాలా బాగున్నట్లు, మంచి మూడ్‌లో ఉన్నట్లు అర్జున్ చెప్పాడు. ఇలాంటి పనికి ఆమె ఎందుకు పాల్పడిందో అర్జున్‌కు కూడా తెలీదు అని అతను రాసుకొచ్చాడు.
బాలీవుడ్ స్టార్ సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్, క్రైమ్ పెట్రోల్ సీరియల్ నటి ప్రేక్షా మెహతా మరణాల తర్వాత ఇప్పుడు సియా ఆత్మహత్యతో ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. గురువారం ఢిల్లీలోని తమ ఇంట్లో సియా బలవన్మరణానికి పాల్పడినట్లు ఆమె మేనేజర్ అర్జున్ ధ్రువీకరించాడు. "ఇది కచ్చితంగా వ్యక్తిగత కారణాలతోటే జరిగివుంటుంది. ప్రొఫెషన్ పరంగా ఆమె చాలా బాగుంది. ఒక కొత్త ప్రాజెక్ట్ విషయంలో రాత్రే ఆమెతో మాట్లాడాను. అప్పుడామె మామూలుగానే ఉంది. నేను, నా కెంపెనీ ఫేమ్ ఎక్స్‌పర్ట్స్ చాలా మంది ఆర్టిస్టుల వ్యవహారాలు చూసుకుంటున్నాం. వారిలో సియా మంచి ప్రతిభావంతురాలు" అని అర్జున్ తెలిపాడు.
చివరి సారిగా ఒక పంజాబీ సాంగ్‌కు డాన్స్ చేసిన టిక్‌టాక్ క్లిప్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది సియా. దానికి ఇప్పటివరకూ 2.9 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.
![]() |
![]() |