![]() |
![]() |

సోషల్ మీడియాలో జనాలు భలే ఉంటారు. సెలబ్రిటీలకు సలహాలు ఇస్తుంటారు. అమాయకంగా! రీసెంట్‌గా ‘ఆర్‌ఎక్స్ 100’ పాప, హాట్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కి ఒకరు సలహా ఇచ్చారు. ఓల్డ్ హీరోలతో యాక్ట్ చేయవద్దని ఓ నెటిజన్ కోరారు. ఆమెకు ఒక రకంగా సలహా ఇవ్వడమే. ఎందుకంటే... ‘వెంకీమామ’లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ సరసన నటించిన పాయల్, ‘డిస్కో రాజా’లో మాస్ మహారాజా రవితేజ సరసన నటించారు. ఇద్దరూ ఓల్డ్ హీరోలే.
‘ఆర్‌ఎక్స్ 100’ తర్వాత యంగ్ హీరోల సరసన ఛాన్సులు వస్తాయని పాయల్ ఎదురు చూశారు. కానీ, రాలేదు. దాంతో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని సీనియర్ హీరోల సరసన నటించారు. క్రేజ్‌ను క్యాష్ చేసుకున్నారు. ఇండస్ట్రీలో సిచ్యువేషన్స్ సలహా ఇచ్చినవాళ్ల కంటే పాయల్‌కు బాగా తెలుసు. అందుకని, వెరైటీగా ఆన్సర్ ఇచ్చారు.
‘‘సీనియర్ హీరోలతో యాక్ట్ చేయవద్దంటున్నావ్! ఎందుకు? ఓల్డ్ హీరోలతో సినిమాలు చేస్తే బ్యాన్ చేస్తారా?’’ అని పాయల్ ఎదురు ప్రశ్నించింది. ప్రస్తుతం పాయల్ చేతిలో ‘5డబ్ల్యూస్’ సినిమా ఉంది. మరో రెండు మూడు డిస్కషన్ స్టేజీలో ఉన్నాయి. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత కొత్త సినిమాలు అనౌన్స్ చేయాలనుకుంటున్నారట.
![]() |
![]() |