![]() |
![]() |

రష్మికా మందన్న.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. వరుస విజయాలతో, వరుస అవకాశాలతో దూసుకుపోతోందీ టాలెంటెడ్ యాక్ట్రస్. అంతేకాదు.. ఒకవైపు యువ కథానాయకులతోనూ, మరోవైపు అగ్ర కథానాయకులతోనూ జోడికడుతూ వార్తల్లో నిలుస్తోంది. మాతృభాష కన్నడతో పాటు తెలుగులోనూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక.. త్వరలో కోలీవుడ్ బాట పడుతోంది.
‘ఖైదీ’ స్టార్ కార్తీ కథానాయకుడిగా ‘రెమో’ ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ రూపొందిస్తున్న ‘సుల్తాన్’ చిత్రంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతోంది రష్మిక. అంతేకాదు.. కథానాయకుడి పాత్రకి ధీటుగా ఉండే నాయిక పాత్రలో కనిపించనుందట ఈ కన్నడ కోమలి. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరలో ‘సుల్తాన్’ థియేటర్లలో సందడి చేసే అవకాశముంది.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇప్పటివరకు రష్మిక ఏ భాషలో తొలిసారిగా నటించినా విజయం దక్కడమనేది సెంటిమెంట్‌గా మారింది. 2016లో విడుదలైన రష్మిక మొదటి కన్నడ సినిమా ‘కిరిక్ పార్టీ’ బ్లాక్‌బస్టర్ కాగా.. 2018లో రిలీజైన తన తొలి తెలుగు చిత్రం ‘ఛలో’ కూడా సక్సెస్‌ఫుల్ వెంచర్‌గా రికార్డులకెక్కింది. ఈ నేపథ్యంలో.. సెంటిమెంట్ పరంగా తమిళనాట కూడా రష్మిక ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్ అవుతుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రష్మిక చేతిలో ‘సుల్తాన్’తో పాటు పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’, కన్నడ చిత్రం ‘పొగరు’ ఉన్నాయి. అలాగే కోలీవుడ్ స్టార్ విజయ్, పాన్ ఇండియా డైరెక్టర్ ఏ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్‌లో ‘తుపాకి’, ‘కత్తి’, ‘సర్కార్’ తరువాత రాబోతున్న నాలుగో చిత్రంలోనూ రష్మిక నాయికగా నటించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.
![]() |
![]() |