![]() |
![]() |

వరుసగా చేసిన ట్వీట్స్‌తో నటి పూనమ్ కౌర్ ప్రస్తుతం తాను డిప్రెషన్‌తో పోరాటం చేస్తున్నానని తెలిపింది. ఒక డైరెక్టర్ తనకు సినిమాలు, టెలివిజన్ కమర్షియల్స్, అనేక ఇతర అవకాశాలు లేకుండా చేశాడని ఆమె ఆరోపించింది. అయితే ఆ డైరెక్టర్ ఎవరనేది ఆమె వెల్లడించలేదు. తానసలు లేననే ఫీల్ ఎందుకు కలిగిందో వివరిస్తూ ఆమె తన కథను మొదలుపెట్టింది. ఆమె ట్వీట్ల ప్రకారం, తన మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడటానికీ, సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన కలుగుతోందని చెప్పడానికీ ఆ దర్శకుడిని సంప్రదించింది. "నువ్వు చనిపోతే అది ఒకరోజు వార్త అవుతుందంతే" అని అతను చెప్పాడని ఆమె రాసింది. ఆ మాటలు తనను చాలా బాధించాయని పూనమ్ పేర్కొంది.
"నా ఫ్రెండ్ ఒక దర్శకుడిని రెండు మూడు సార్లు కలిసి, పూనమ్ పరిస్థితి బాగా లేదని, ఆమెను ఆ స్థితి నుంచి బయటపడెయ్యడానికి మనం ఏమైనా చెయ్యాలని అడిగింది. ఆ డైరెక్టర్‌లో జాప్యం చేసే టెక్నిక్స్ ఉన్నాయి. అప్పుడు నేను ఏమాత్రం బాగా లేనప్పుడు, బాధగా ఫీలవుతున్నప్పుడు మనం ఏం చెయ్యాలని అడిగాను" అని ఆమె ట్వీట్ చేసింది. ఆ డైరెక్టర్ పేరున్నవాడని ఆమె వెల్లడించింది. "అతను మీడియాను, మూవీ మాఫియాను, అడ్వర్టయిజ్‌మెంట్లను కంట్రోల్ చేస్తుంటాడు. ఆన్‌లైన్‌లో ఇనడైరెక్ట్ ఆర్టికల్స్ ద్వారా అతను నాతో కమ్యూనికేట్ చేసే తీరు నన్ను మరింతగా కుంగదీసి, డిప్రెషన్‌లోకి నెట్టేశాయి. అనవసరమైన రాతలు నన్ను కుంగదీశాయి. నేనొక రిప్లై ఇచ్చాను, అదీ డైరెక్ట్‌గా.." అని రాసుకొచ్చింది పూనమ్.
మరో ట్వీట్‌లో అతను అనుచితంగా ప్రవర్తించేవాడని ఆమె ఆరోపించింది. "గురూజీ" అని అతడిని సంబోధించిన పూనమ్, తన స్నేహితుల అధికారాన్నీ, రాజకీయ పరిచయాల్నీ అతను దుర్వినియోగం చేస్తుంటాడని తెలిపింది. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణం తనను తీవ్రంగా కలవరపరచిందనీ, అయితే తన జీవితాన్ని అతడిలా ముగించాలని అనుకోవడం లేదనీ ఆమె చెప్పింది. ప్రస్తుతం తాను డిప్రెషన్ నుంచి బయట పడేందుకు థెరపీ తీసుకుంటున్నట్లు తెలిపి, ఆ ట్వీట్ల పరంపరను ముగించింది.
![]() |
![]() |