![]() |
![]() |

దగ్గుబాటి సురేశ్‌బాబు పెద్దకొడుకు రానా ఇటు హీరోగా, అటు విలన్‌గా రాణిస్తూ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. అతని కోసం ఇవాళ రచయితలు, దర్శకులు పాత్రలు సృష్టిస్తున్నారంటే నటుడిగా అతని ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కాగా కొన్నాళ్ల నుంచి సురేశ్‌బాబు చిన్నకొడుకు అభిరామ్ సినిమా ఎంట్రీ గురించి ప్రచారం జరుగుతూ వస్తోంది. మూడేళ్ల క్రితమే వంశీ డైరెక్షన్‌లో ఫ్యాషన్ డిజైనర్.. సన్నాఫ్ లేడీస్ టైలర్ అనే సినిమా అనౌన్స్ చేశారు కానీ, ఇంతదాకా అది వాస్తవ రూపం దాల్చలేదు. అసలతను నటుడిగా ఎంట్రీ ఇస్తాడా, లేదా.. అనే విషయం ఇప్పటిదాకా తేలలేదు.
దీనిపై అభిరామ్ తండ్రి సురేశ్‌బాబు స్పందించారు. అభిరామ్ యాక్టర్ కావాలనుకున్నాడనీ, దాని కోసం శిక్షణ కూడా తీసుకున్నాడనీ తెలిపారు. "తనేమిటో ప్రూవ్ చేసుకున్న రోజున, అతని పర్ఫార్మెన్స్‌కి ఇంప్రెస్ అయిన రోజున నేను అతనికి సపోర్ట్ చేస్తాను. ఈ విషయంలో నేను ప్రాక్టికల్‌గా ఉంటాను. ప్రేక్షకులు టాలెంట్ ఉన్నవాళ్లనే ఆదరిస్తారు. ఫలానా వాళ్ల కొడుకని వాళ్లు చూడరు. కథ బాగుండి, ఆ అబ్బాయికి టాలెంట్ ఉంటే, ప్రాపర్‌గా అతను తనను తాను ట్రైన్ అవుతూ ఉంటే.. అప్పుడు ఫ్యామిలీ అతనికి సపోర్ట్‌గా నిలుస్తుంది. అతను ప్రూవ్ చేసుకుంటే, అతని కోసం చాలా మంది డైరెక్టర్లు స్క్రిప్టులు చేసుకొని వస్తారు. బహుశా ఆ రోజు రావచ్చేమో. 100 శాతం అవుతుందని చెప్పలేను. స్కిల్స్ ఉంటేనే ఏ వృత్తిలోనైనా రాణిస్తాం. చాలా మంది హీరోలు రాణించలేక వెళ్లిపోతే, చాలామంది హీరోలుగా రాణించారు. ప్రేక్షకుల ఆదరణ, ఆ నటుడి ప్రతిభ మీద ఇది ఆధారపడి ఉంటుంది. మనల్ని మనం నిరూపించుకోవాల్సిందే" అని ఆయన చెప్పారు.
![]() |
![]() |