![]() |
![]() |

ఫీమేల్ డైరెక్టర్, ‘రాజుగాడు’ ఫేమ్ సంజనారెడ్డి కండీషన్ క్రిటికల్‌గా ఉందని వచ్చిన వార్తలను రైటర్ కమ్ డైరెక్టర్ కోన వెంకట్ కొట్టిపారేశారు. ఆమెకు ఏం కాలేదనీ, బావుందనీ ఆయన పేర్కొన్నారు. రాజ్‌తరుణ్ హీరోగా యాక్ట్ చేసిన ‘రాజుగాడు’తో సంజనారెడ్డి డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అయ్యారు. జ్వరం ఎక్కువగా రావడంతో ప్రయివేట్ హాస్పటల్‌కి వెళ్లగా, కండీషన్ బాలేదని ఐసీయుకి షిఫ్ట్ చేసినట్టుగా వార్తలు వినిపించాయి. పరిస్థితి విషమించిందని, న్యూరో సర్జన్లు సమస్యను గుర్తించి చికిత్స అందిస్తున్నారని హాస్పటల్ వర్గాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే, అటువంటిది ఏమీ లేదనీ కోన వెంకట్ ట్వీట్ చేశారు.

‘‘మూడు రోజులుగా సంజనారెడ్డి లిక్విడ్ డైట్లో ఉంది. అందువల్ల, ఇంటిలో సృహ తప్పి పడిపోయింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతా సర్దుకుంటుంది. త్వరలో ఆమెకు నయం అవుతుంది. ఈ రోజే (సోమవారం) డిశ్చార్జ్ చేస్తారు’’ అని కోన వెంకట్ పేర్కొన్నారు. ఆయన రచన, నిర్మాణంలో సంజనారెడ్డి కరణం మల్లేశ్వరి బయోపిక్ డైరెక్ట్ చేయనున్నట్టు ఇటీవల ప్రకటించారు. త్వరలో ఆ సినిమా పనుల్లో ఆమె పాల్గొంటుందని కోన వెంకట్ ధీమాగా ఉన్నారు.
![]() |
![]() |