![]() |
![]() |
![]()
హైదరాబాద్‌లోని నందమూరి బాలకృష్ణ ఛైర్మన్‌గా వ్యవహరిస్తోన్న బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్‌కు ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయి. కేన్సర్‌తో మరణించిన తన భార్య పేరిట దివంగత ఎన్టీఆర్ ఏర్పాటుచేసిన ఆ హాస్పిటల్ సేవా దృక్పథంతో ఎన్నో వేల మంది కేన్సర్ బాధితులకు చికిత్స అందిస్తూ వస్తోంది. అలాంటి హాస్పిటల్‌ను ఆంధ్రప్రదేశ్‌లోనూ నెలకొల్పాలని బాలకృష్ణ సంకల్పించారు. ఇందుకోసం ఇప్పటికే స్థలాన్ని కొనుగోలు చేశారు కూడా. హైదరాబాద్ హాస్పిటల్ కంటే అక్కడి హాస్పిటల్‌ను మరింత పెద్దదిగా ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ హాస్పిటల్ కోసం ఏకంగా రూ. 650 కోట్లను కేటాయిస్తున్నారు. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలియజేశారు.
"ఆంధ్రప్రదేశ్‌లో బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్ కోసం 15 ఎకరాల స్థలం కొన్నాం. కాకపోతే అక్కడ ముందుగా మౌలిక సదుపాయాలు రావాలి. పేషెంట్లు రావాలంటే చుట్టుపక్కల రోడ్లు పడాలి, బస్సులు పడాలి. కరెంట్ రావాలి. వాటి కోసం మేం ఎదురుచూస్తున్నాం. అక్కడి డెవలప్‌మెంట్ మీద ఆ ప్రాజెక్ట్ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అది వెరీ బిగ్ ప్రాజెక్ట్. రూ. 650 కోట్ల ప్రాజెక్ట్. హైదరాబాద్‌లో ఉంది 500 పడకల హాస్పిటల్ అయితే, అక్కడ మేం ప్లాన్ చేస్తోంది వెయ్యి పడకల హాస్పిటల్. అందువల్ల అక్కడి సౌకర్యాలను బట్టి ముందుకెళ్దామని చూస్తున్నాం" అని బాలకృష్ణ చెప్పారు.
![]() |
![]() |