![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఓజీ'. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టార్ ఫిల్మ్ లో ప్రియాంకా మోహన్ హీరోయిన్ కాగా, ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఇమ్రాన్ హష్మీ ఫస్ట్ లుక్ వచ్చింది.
నేడు(మార్చి 24) ఇమ్రాన్ హష్మీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు విషెస్ తెలుపుతూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ లో ఇమ్రాన్ హష్మీ లుక్ అదిరిపోయింది. గడ్డం, నుదుటున గాటు, చేతికి కడియం, టాటూతో రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ చూస్తుంటేనే.. పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ తలపడే సన్నివేశాలు ఏ స్థాయిలో ఉంటాయనే ఆసక్తి కలుగుతోంది.

శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా రవి కె. చంద్రన్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |