Home  »  News  »  శ్రీనివాస మంగాపురం బాక్సాఫీస్ డే 1 వసూళ్ల తుఫాన్!

Updated : Jul 31, 2026

 

-నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైన శ్రీనివాస మంగాపురం
-జై కృష్ణ పెర్ ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఫిదా
-దీంతో తొలి రోజు రికార్డు కలెక్షన్స్

ఘట్టమనేని జై కృష్ణ(Jai Krishna)నిన్న వరల్డ్ వైడ్ గా రొమాంటిక్ యాక్షన్ డ్రామా 'శ్రీనివాస మంగాపురం'( తో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ 'అజయ్ భూపతి' దర్శకత్వంలో తెరకెక్కగా జై కృష్ణ తో 'స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన' అంటూ బంగారు బుల్లోడు బాలయ్య తో కలిసి చిందులేసిన బాలీవుడ్ భామ రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయమైంది. మోహన్ బాబు, నరేష్, బ్రహ్మాజీ కీ రోల్స్ పోషించారు. 


మొదటి రోజు శ్రీనివాస మంగాపురం వరల్డ్ వైడ్ గా 2 .2 కోట్ల రూపాయిల గ్రాస్ వసూలు చేసినట్టుగా ట్రేడ్ వర్గాలలో వినిపిస్తుంది. తొలిరోజు ఇండియా వ్యాప్తంగా గ్రాస్ వసూళ్లు 1.40 కోట్లకు చేరుకున్నాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అత్యధికంగా 1.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావడం విశేషం. కర్ణాటకలో  5 లక్షలు, తమిళనాడులో  1 లక్ష, మిగిలిన భారతీయ ప్రాంతాల్లో  4 లక్షల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. దీంతో  ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు  2 కోట్ల నుండి  2.2 కోట్ల రేంజ్‌లో గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద ఘనమైన బోణీ కొట్టింది అడ్వాన్స్ బుకింగ్స్ లోనే 1 కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి శుభారంభాన్ని సూచించింది.


Also read: Newtons 3rd law movie review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా మూవీ రివ్యూ 

థియేటర్స్ ఆక్యుపెన్సీ విషయంలోనూ  మెరుగైన ఆదరణ పొందింది. తెలుగు వెర్షన్ రోజు మొత్తంలో సగటున 19.31% ఆక్యుపెన్సీని నమోదు చేయగా, ఉదయం షోలు అత్యధికంగా 22% ఫుట్‌ఫాల్స్‌తో సందడిగా మారాయి. మధ్యాహ్నం 15.77%, సాయంత్రం 17.38%, మరియు నైట్ షోలలో 18% ఆక్యుపెన్సీ కనిపించింది.  మాస్ కాన్సెప్ట్, జై కృష్ణ ఎనర్జిటిక్ డ్యాన్సులు, యాక్షన్ సన్నివేశాలు అభిమానులని, ప్రేక్షకులని  విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు మోహన్ బాబు విలనిజం, జి.వి. ప్రకాష్ కుమార్ బ్యాక్‌గ్రౌండ్ ప్రధాన బలంగా నిలిచాయి. టాక్ పరంగా, రివ్యూస్ పరంగా బాగానే వస్తుండటంతో  వీకెండ్ కలెక్షన్స్ మరింత పుంజుకునే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.

Jai Krishna, Srinivasa Mangapuram, Rasha Thadani, Mohan Babu 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.