![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'హరిహర వీరమల్లు'. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. గతంలో కొంత షూటింగ్ జరిగాక, 'భీమ్లా నాయక్' సినిమా కోసం పవన్ విరామమిచ్చారు. ఏప్రిల్ 8 నుంచి షూటింగ్ మళ్ళీ షూటింగ్ షురూ చేశారు. ఈ షెడ్యూల్‌లో ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను తీస్తున్నారు.

నేడు శ్రీరామ నవమి సందర్భంగా 'హరిహర వీరమల్లు' సెట్ లో పూజ నిర్వహించారు. వీరమల్లు గెటప్ లోనే పవన్ ఈ పూజలో పాల్గొన్నారు. పవన్ తో పాటు క్రిష్, మిగతా మూవీ టీమ్ పాల్గొంది. అంతేకాదు నవమి కానుకగా నేడు స్పెషల్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు మేకర్స్. బల్లెం పట్టుకొని పవన్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు.

పీరియడ్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీలో బందిపోటు దొంగ వీరమల్లుగా పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫఖ్రి కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ మూవీకి ఎం.ఎం. కీరవాణి సంగీతం, జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.
![]() |
![]() |