![]() |
![]() |

కామెడీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ ఓ వైపు కామెడీ సినిమాలు చేస్తూనే మధ్యమధ్యలో విభిన్న పాత్రలు, విభిన్న చిత్రాలతో అలరిస్తూ ఉంటాడు. గతేడాది 'నాంది' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న నరేష్.. ఇప్పుడు మరో విభిన్న చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.
నరేష్ నటిస్తున్న 59వ చిత్రం ఏఆర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాకి 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. నేడు శ్రీరామ నవమి సందర్భంగా టైటిల్ తో కూడిన కాన్సెప్ట్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ యానిమేటెడ్ పోస్టర్ లో జనాలు గుంపులుగా ఆయుధాలు పట్టుకొని కనిపిస్తున్నారు. ఇది మారేడుమిల్లి అటవీప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆదివాసీల కథ అని తెలుస్తోంది.

జీ స్టూడియోస్ తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది.
![]() |
![]() |