![]() |
![]() |

జర్సీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దగుమ్మ శ్రద్ధ శ్రీనాథ్. ఆ మూవీలో ఆమె ప్రదర్శించిన అభినయానికి ఎంతో మంది శ్రద్ద శ్రీనాధ్ కి అభిమానులుగా మారిపోయారు. కథా ప్రాధాన్యంతో పాటు హీరోయిన్ క్యారక్టర్ కి ప్రాధాన్యమున్న సినిమాలు మాత్రమే చేసే శ్రద్దా శ్రీనాధ్ తాజాగా తన సీక్రెట్ గురించి చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.
శ్రద్ధ శ్రీనాథ్ గుండెల మీద ఒక టాటూ ఉంటుంది. ఆ టాటూ గురించి చెప్తు తన క్రష్ గురించి పొడిపించుకున్నానని పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి ప్రేమలో పడ్డానని అందుకే ఆ టాటూ వేయించుకున్నానని చాలా క్లియర్ గా చెప్పింది. తన టాటూ పై ఉన్నది బీటిల్ అనే బ్రాండ్ ఆల్బమ్ కవరే అని చెప్పుకొచ్చింది. పైగా ఆ బ్రాండ్ ని పరిచయం చేసింది తను ప్రేమించిన వ్యక్తే అని కూడా చెప్పింది. ప్రస్తుతం ఆమె చెప్పిన ఈ మాటలు సంచలనం సృష్టిస్తున్నాయి.సోషల్ మీడియా లో ఆమె చెప్పిన మాటలు విన్న కొంత మంది శ్రద్ధ శ్రీనాథ్ తన లవర్ ఎవరో చెప్తే బాగుండేదని అంటున్నారు.
శ్రద్ధ శ్రీనాథ్ ప్రస్తుతం వెంకటేష్ హీరోగా వస్తున్న సైంధవ్ లో వెంకటేష్ కి జోడిగా నటిస్తుంది. ఈ నెల 13 న పాన్ ఇండియా లెవల్లో విడుదల అవుతున్న సైంధవ్‌లో శ్రద్ద సూపర్ గా నటించిందనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో వినపడుతున్నాయి.
![]() |
![]() |