![]() |
![]() |
.webp)
ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ స్టార్స్ అంటే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తాయి. ఓకే ఏడాది ఈ ఆరుగురు స్టార్ల సినిమాలు విడుదలైతే థియేటర్లు కళకళలాడతాయి. ఈ 2024 లో అలాంటి సినిమా పండుగ కనిపించే అవకాశముంది.
ఈ ఏడాది ముందుగా 'గుంటూరు కారం'తో మహేష్ బాబు రాబోతున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఏప్రిల్ 5న 'దేవర'తో జూనియర్ ఎన్టీఆర్, ఆగస్టు 15న 'పుష్ప: ది రూల్'తో అల్లు అర్జున్ రానున్నారు. ఇక పవన్ కళ్యాణ్ 'ఓజీ', ప్రభాస్ 'కల్కి 2898 AD', రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' కూడా ఈ ఏడాది విడుదలయ్యే అవకాశముంది. ఈ ఆరు సినిమాలకు కూడా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించగల సత్తా ఉంది. మరి ఆరు సినిమాలు 2024 సంవత్సరాన్ని అసలుసిసలైన తెలుగు సినిమా పండుగగా మారుస్తాయేమో చూద్దాం.
![]() |
![]() |