![]() |
![]() |

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న అగ్ర కథానాయికల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. `ఎటాక్`, `థాంక్ గాండ్`, `మేడే` వంటి బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో పాటు క్రిష్ డైరెక్టోరియల్ (తెలుగు), `అయలాన్` (తమిళ్) కూడా ఆమె చేతిలో ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా రకుల్ ఓ బైలింగ్వల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు.. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కోసం షూటింగ్ లో కూడా జాయిన్ అయిందట. ఆ వివరాల్లోకి వెళితే.. హాలోవీన్ రాత్రిలో అనూహ్య ఘటనలు చోటుచేసుకోవడంతో ఐదుగురు అమ్మాయిల జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనే పాయింట్ తో కోలీవుడ్ కెప్టెన్ ఏఎల్ విజయ్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. `అక్టోబర్ థర్టీ ఫస్ట్ లేడీస్ నైట్` పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తుండగా.. నివేదా పెతురాజ్, మంజిమా మోహన్, మేఘా ఆకాశ్, రెబ్బా మోనికా జాన్ నాయికలుగా నటిస్తున్నారు. అలాగే ఐదో అమ్మాయిగా రకుల్ తాజాగా యూనిట్ లో జాయిన్ అయిందని టాక్.
మరి.. ఇంట్రెస్టింగ్ పాయింట్ తో రూపొందుతున్న ఈ బైలింగ్వల్ థ్రిల్లర్.. రకుల్ కెరీర్ కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
![]() |
![]() |