![]() |
![]() |

చార్మింగ్ స్టార్ శర్వానంద్, వింటేజ్ కామెడీ ఎంటర్‌టైనర్స్‌కి కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్‌లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'జార్జ్ క్రిష్' ఈరోజే గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. 2027 జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీను వైట్ల అంటేనే మనకు గుర్తొచ్చేవి మైండ్ బ్లోయింగ్ పంచ్ డైలాగ్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్. ఈ సినిమాకి కూడా సీనియర్ రైటర్ గోపీమోహన్, నందు సవిరిగాన తమ పవర్‌ఫుల్ అండ్ హిలేరియస్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తుండటం విశేషం.
కే.వి. గుహన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా అవినాష్ కొల్లా, ఎడిటర్‌గా అమర్ రెడ్డి తమ మ్యాజిక్‌ని చూపించబోతున్నారు.
సంక్రాంతి రేసులో శర్వానంద్‌కి ఎంతటి ఘనమైన రికార్డు ఉందో తెలిసిందే. సరైన కామెడీ, ఎమోషన్స్ కుదిరితే సంక్రాంతి విన్నర్‌గా నిలవడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. అలాంటిది శ్రీను వైట్ల డైరెక్షన్ తోడైతే థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయడం ఖాయం.
ఒకప్పుడు ఎన్నో ఎవర్గ్రీన్ కామెడీ ఫిలిమ్స్ ని అందించిన శ్రీను వైట్ల.. సంక్రాంతి హీరో శర్వానంద్ తో వచ్చి, సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తారేమో చూడాలి.
https://x.com/AKentsOfficial/status/2088162162682609772
Sharwanand, Sreenu Vaitla, George Krish, Movie Launch, AK Entertainments
![]() |
![]() |