![]() |
![]() |

అన్ష్ త్రోరాట్, వాసవి గణేషన్ జంటగా బిక్షు యాదవ్ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా 'హుషార్ పిట్టలు' ప్రీమియర్స్ పూర్తయ్యాయి. సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ ఫిల్మ్స్ లాంటి బడా డిస్ట్రిబ్యూటర్లు రిలీజ్ చేస్తున్న ఈ చిన్న సినిమా ప్రమోషనల్ కంటెంట్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో ఒక అడల్ట్ కామెడీ ఫిల్మ్ అనే అభిప్రాయాన్ని కలిగించింది. మరి ఈ సినిమా కేవలం అడల్ట్ కంటెంట్‌కే పరిమితమైందా? లేక టీనేజర్స్, తల్లిదండ్రులు చూడాల్సిన ఒక పవర్‌ఫుల్ మెసేజ్ ఇచ్చిందా?
ఈ సినిమా కథ విషయానికి వస్తే... ఒక పల్లెటూర్లో ఉండే ఇద్దరు టీనేజర్స్.. ఆకర్షణ, పరిపక్వత లేని వయసులో శారీరక హద్దులు దాటేస్తారు. ఈ విషయం ఊర్లో బయటపడటం, దాని వల్ల తల్లిదండ్రులు పడే వేదన, ఆ తర్వాత ఆ టీనేజర్స్ తీసుకునే నిర్ణయాలు ఏంటి అనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది.
మొదటి షో చూసిన ఆడియన్స్ ట్విట్టర్‌లో ఏమంటున్నారంటే.. యూత్‌ఫుల్ కామెడీ అండ్ ఎమోషనల్ ఫిల్మ్ అంటున్నారు. అడల్ట్ కామెడీ ఉన్నప్పటికీ, ఎమోషన్స్ కూడా బాగానే ఉన్నాయని చెబుతున్నారు.
ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫన్ అండ్ లవ్ ట్రాక్ వర్కవుట్ అయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి సినిమా రూపురేఖలు మారిపోతాయి. ఆకర్షణలో పడి తప్పుడు దారిలో వెళ్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, పరువు కోసం తండ్రి పడే ఆవేదన ఏంటి అనేది చాలా ఎమోషనల్ గా చూపించారు. దర్శకుడు బిక్షు యాదవ్ ఎంచుకున్న కథాంశం చాలా రియలిస్టిక్ గా ఉందని, కేవలం యూత్ మాత్రమే కాదు.. తల్లిదండ్రులు కూడా చూడాల్సిన సినిమా అని ట్విట్టర్ లో ప్రశంసిస్తున్నారు. టీనేజ్ లో పిల్లల ఆలోచనలు ఎలా ఉంటాయి? ఆ వయసులో వేసే తప్పటడుగులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి? వంటి అంశాలను ఇందులో చూపించారు.
నటీనటుల విషయానికి వస్తే.. అన్ష్, వాసవి గణేషన్ కొత్తవారైనా సరే చాలా నాచురల్ గా నటించారు. ఎమోషనల్ సీన్స్‌లో వారి పర్‌ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. సపోర్టింగ్ రోల్స్ చేసిన అంజి వల్గుమాన్, సునీతా మనోహర్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతికంగా చూస్తే.. చరణ్ అర్జున్ అందించిన సంగీతం విలేజ్ బ్యాక్‌డ్రాప్‌కి సరిగ్గా సెట్ అయింది. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ సినిమాని ఎక్కడా బోర్ కొట్టకుండా క్రిస్ప్‌గా ఉంచింది.
ట్విట్టర్ టాక్ ప్రకారం.. ప్రారంభంలో కాస్త అడల్ట్ హ్యూమర్ ఉన్నప్పటికీ, ఓవరాల్‌గా 'హుషార్ పిట్టలు' ఒక ఎమోషనల్ అండ్ మెసేజ్ ఒరియంటెడ్ యూత్‌ఫుల్ డ్రామా.
Hushar Pittalu Review, Ansh Thorat, Vasavi Ganeshan, Bikshu Director
![]() |
![]() |