Home  »  News  »  'భోగి' సినిమాపై సంపత్ నంది ఎమోషనల్ పోస్ట్.. సెట్లో కన్నీళ్లు పెట్టుకున్న 200 మంది!

Updated : Jun 18, 2026

టాలీవుడ్ యంగ్ అండ్ వర్సటైల్ హీరో శర్వానంద్ నటిస్తున్న సరికొత్త చిత్రం 'భోగి'. మాస్ కమర్షియల్ చిత్రాల డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి తాజాగా దర్శకుడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్‌గా మారింది.

సినిమాలోని కొన్ని సన్నివేశాలు తనను ఎంతగానో కదిలించాయని, గత 24 గంటలుగా ఆ ఎమోషన్స్ నుండి తాను బయటకు రాలేకపోతున్నానని సంపత్ నంది పేర్కొన్నారు. ముఖ్యంగా హీరో శర్వానంద్ గత పదేళ్ల కెరీర్‌లో ఎన్నడూ లేనంత అద్భుతంగా ఈ చిత్రంలో జీవించారని కొనియాడారు. కొన్ని క్లిష్టమైన ఎమోషనల్ సీన్స్ చిత్రీకరణ సమయంలో శర్వానంద్ నటనకు ముగ్ధుడై తను 'కట్' చెప్పడం కూడా మర్చిపోయానని తెలిపారు.

ఆ సమయంలో షూటింగ్ సెట్‌లో ఉన్న దాదాపు 200 మంది యూనిట్ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి లోనై, కళ్లు తుడుచుకుంటూ చప్పట్లు కొట్టారని డైరెక్టర్ వెల్లడించారు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఇలాంటి అరుదైన అనుభూతిని ఎదుర్కోవడం ఇదే మొదటిసారని ఆయన చెప్పుకొచ్చారు. థియేటర్లలో ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా కచ్చితంగా ఇలాగే కళ్లు చెమ్మగిల్లేలా ఫీలవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ చిత్రం పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటోంది. ఉత్తర తెలంగాణ మరియు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ కథాంశంతో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో ముందుండే శర్వానంద్‌కు ఈ చిత్రం కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు.

ఈ మూవీలో శర్వానంద్‌ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. గ్లామరస్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ 'కందుల సులోచన రాణి' అనే కీలక పాత్రలో కనిపించనుండగా, మరో కథానాయిక డింపుల్ హయాతి 'మందారం' అనే కాస్త బోల్డ్ అండ్ పవర్‌ఫుల్ పాత్రలో సందడి చేయనుంది. వీరిద్దరి పాత్రలు కూడా కథను మలుపు తిప్పే విధంగా ఉంటాయని సమాచారం.

దర్శకుడు సంపత్ నంది పెట్టిన ఈ పోస్ట్‌తో శర్వానంద్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయింది. సోషల్ మీడియాలో ఈ అప్‌డేట్ తెగ హల్చల్ చేస్తోంది. శర్వానంద్ లోని అసలైన నటుడిని సంపత్ నంది ఈ సినిమా ద్వారా సరికొత్తగా ఆవిష్కరించబోతున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో సైతం పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.

అన్ని హంగులు అద్దుకుంటున్న ఈ హై-వోల్టేజ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాను ఈ ఏడాది ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. మరి శర్వానంద్-సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న ఈ 'భోగి' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.