Home  »  News  »  12 మంది బ్రేకప్ లవర్స్‌తో రమ్యకృష్ణ 'సెకండ్ లవ్'.. సౌత్‌లో క్రేజీ రియాలిటీ సిరీస్!

Updated : Jun 18, 2026

వెండితెరపై తనదైన నటనతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ ఇప్పుడు సరికొత్త అవతారంలో మెరిసేందుకు సిద్ధమయ్యారు. 'బాహుబలి' చిత్రంలో శివగామిగా పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ వర్సటైల్ యాక్ట్రెస్, ప్రస్తుతం ఓ డిఫరెంట్ రియాలిటీ షోతో డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయబోతున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్' వేదికగా రానున్న ఒక ఆసక్తికరమైన డేటింగ్ షోకి ఆమె హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

'సెకండ్ లవ్' అనే వినూత్న టైటిల్‌తో రూపొందుతున్న ఈ తమిళ రియాలిటీ రొమాన్స్ సిరీస్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ షో కాన్సెప్ట్ ప్రకారం.. జీవితంలో ఇప్పటికే బ్రేకప్ అయ్యి ఒంటరిగా ఉన్న, ముప్పై ఏళ్ల లోపు వయసు గల 12 మంది సింగిల్స్‌ను ఒక విల్లాలోకి పంపిస్తారు. అక్కడ వారు తమ జీవితంలో సరికొత్తగా రెండో ప్రేమను వెతుక్కునేందుకు నిర్వాహకులు రకరకాల టాస్కులు, సందర్భాలను క్రియేట్ చేయబోతున్నారు. వినడానికి చాలా వెరైటీగా ఉన్న ఈ కాన్సెప్ట్ నేటి జనరేషన్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది.

ఇటీవలే విడుదలైన ఈ షో ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రమ్యకృష్ణ లుక్ నెట్టింట సెన్సేషన్‌గా మారింది. విరిగిపోయిన హార్ట్ సింబల్‌ను ప్యాచ్ అప్ చేస్తూ ఆమె ఇచ్చిన స్టైలిష్ పోజ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో రమ్యకృష్ణ 90ల నాటి హీరోయిన్‌లా కాకుండా, నేటి జెన్ జి భామలకు గట్టి పోటీ ఇచ్చే రేంజ్‌లో ఎంతో యంగ్‌గా, గ్లామరస్‌గా కనిపించడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే ప్రస్తుతం తమిళ జియో హాట్‌స్టార్ అఫీషియల్ హ్యాండిల్‌లో మాత్రమే ఈ అనౌన్స్‌మెంట్ రాగా, ఇదే షో తెలుగులో కూడా వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇప్పటికే టాలీవుడ్‌లో రమ్యకృష్ణ సమకాలీన స్టార్ హీరోలైన కింగ్ నాగార్జున, నందమూరి బాలకృష్ణ, జగపతి బాబు వంటి వారు బుల్లితెర, ఓటీటీ వేదికలపై హోస్ట్‌లుగా మారి సూపర్ సక్సెస్ సాధించారు. అలాగే రీసెంట్‌గా లయ, రాధ, ముచ్చర్ల అరుణ వంటి సీనియర్ హీరోయిన్లు కూడా వివిధ రియాలిటీ షోల ద్వారా సరికొత్తగా ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు అదే బాటలో రమ్యకృష్ణ కూడా హోస్ట్‌గా అడుగుపెడుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో భారీ క్రేజ్ నెలకొంది.

ఇలాంటి ఓపెన్ డేటింగ్ షోలు నార్త్ ఆడియన్స్‌కు 'ఎంటివి స్ప్లిట్స్‌విల్లా' వంటి సిరీస్‌లతో బాగా అలవాటైనప్పటికీ, సౌత్ మార్కెట్‌కు ఇది చాలా కొత్త ప్రయోగమనే చెప్పాలి. దీంతో ఈ రొమాంటిక్ రియాలిటీ సిరీస్‌పై ప్రశంసలతో పాటు కొన్ని విమర్శలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఏదేమైనా రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎంచుకున్న ఈ 'సెకండ్ లవ్' షో ఏ రేంజ్‌లో దూసుకుపోతుందో, నేటి యంగ్ ఆడియన్స్‌ను ఎలా మెప్పిస్తుందో చూడాలంటే ఈ క్రేజీ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యేంతవరకు వేచి చూడాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.