![]() |
![]() |
ప్రపంచ సినిమా చరిత్రలోనే తెలుగు జెండాను రెపరెపలాడించిన ట్రెండ్ సెట్టర్ 'బాహుబలి'. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సృష్టించిన ఈ మహా అద్భుతం ఇప్పుడు మరోసారి గ్లోబల్ వేదికపై గర్జించడానికి సిద్ధమైంది. బాహుబలి ఫ్రాంఛైజీ నుంచి వస్తున్న లేటెస్ట్ యానిమేషన్ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.
ఫ్రాన్స్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగబోయే 'అన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిలిం ఫెస్టివల్'లో ఈ మూవీ ప్రదర్శితం కానుంది. ఈ వేడుకల్లో భాగంగా 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' సినిమాకు సంబంధించిన బుకింగ్స్‌ను నిర్వాహకులు తాజాగా ప్రారంభించారు. విండోస్ ఓపెన్ చేసిన కేవలం రెండే రెండు నిమిషాల్లో టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోవడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.
ఇంతటి ఘనత సాధించడం వెనుక దర్శకుడు రాజమౌళి బ్రాండ్ ఇమేజ్, ప్రభాస్ గ్లోబల్ ఫ్యాన్ బేస్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక ఫెస్టివల్‌లో 'వర్క్ ఇన్ ప్రోగ్రెస్' కేటగిరీ కింద ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. గతంలో ఇదే విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న యానిమేషన్ వండర్స్ 'స్పైడర్‌మ్యాన్ ఇంటు ది స్పైడర్ వర్స్', 'ఫ్లో' వంటి చిత్రాలు స్క్రీనింగ్ కావడం విశేషం. ఇప్పుడు ఆ లైనప్‌లోకి మన బాహుబలి చేరడంతో తెలుగు వారి ఖ్యాతి మరింత పెరిగింది.
మొత్తం రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న ఈ యానిమేషన్ ప్రాజెక్ట్‌ను ఇషాన్ శుక్లా డైరెక్ట్ చేస్తున్నారు. జక్కన్న స్వయంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన మొదటి భాగానికి సంబంధించిన గ్లింప్స్ అండ్ టీజర్ విశేషమైన రెస్పాన్స్ అందుకొని సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి.
గ్లోబల్ మార్కెట్‌లో బాహుబలి రేంజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ అరుదైన టికెట్ల సునామీతో మరోసారి ప్రూవ్ అయింది. ఈ అప్‌డేట్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ నెట్టింట తెగ రచ్చ చేస్తున్నారు. అంతర్జాతీయ ఆడియన్స్ సైతం మహిష్మతి సామ్రాజ్యపు యానిమేషన్ విజువల్స్ చూసేందుకు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది (2027) ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయడానికి ముస్తాబవుతోంది.
![]() |
![]() |