![]() |
![]() |
.webp)
సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ ల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో సీతగా నటించి మెప్పించిన భామ అంజలి.. గత నెలలో గీతాంజలి మళ్ళీ వచ్చింది అంటు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లో ఒక ముఖ్య పాత్రని పోషించింది. తాజాగా అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది.
విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కొన్ని రోజుల క్రితం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని జరుపుకుంది. నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు..సినిమా విజయవంతం కావాలని అభిలషించారు. అదే టైం లో విశ్వక్ తో పాటు హీరోయిన్ నేహా, అంజలి, మిగతా నటీ నటులు, సాంకేతిక నిపుణులకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడు. ఈ ఫంక్షన్ లోనే అంజలిని బాలకృష్ణ చేత్తో నెడతాడు.ఆయన సరదాగా అలా నెట్టాడనే విషయం ఫంక్షన్ మొత్తం ఫాలో అయిన వాళ్ళకి అర్ధం అవుతుంది. పైగా అందరు చూస్తుండగానే స్టేజ్ పైనే అదంతా జరిగింది. కానీ కొంతమంది అంజలి పట్ల బాలకృష్ణ దురుసు ప్రవర్తన అంటు అత్యుత్సాహంతో సదరు వీడియోని ప్రమోట్ చెయ్యడం మొదలుపెట్టారు. నేషనల్ లెవల్లో కూడా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరి మైండ్ బ్లాక్ అయ్యేలా అంజలి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.
.webp)
బాలకృష్ణ గారు నేను ఎప్పటినుంచో చాలా స్నేహంగా ఉంటాం. ఒకరు పట్ల మరొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకునే వాళ్ళం. ఆయనతో కలిసి వేదిక పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని ట్వీట్ చేసింది. అదే విధంగా ఈవెంట్ లో వాళ్ళిద్దరి మధ్య జరిగిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని వీడియో రూపంగా చేసింది. బాలకృష్ణ ఆమెతో నవ్వుతూ మాట్లాడటంతో పాటు ఆమెని తోసిన క్లిప్ కూడా ఉంది. బాలకృష్ణ, అంజలి లు జంటగా డిక్టేటర్ అనే మూవీలో చేసారు. అందులో ఇద్దరి స్క్రీన్ ప్రెజన్స్ అదిరిపోతుంది. డాన్స్ ల్లోను ఇద్దరి మధ్య బాండింగ్ సూపర్ గా ఉంటుంది. 2016 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
![]() |
![]() |