![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. 2020 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ ఫ్యాన్స్ ని మెప్పించింది. అయితే మహేష్-అనిల్ కాంబినేషన్ లో మరో మూవీ రానుందని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. కానీ ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా అనిల్.. మహేష్ తో మూవీపై క్లారిటీ ఇచ్చారు.
అనిల్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మహేష్ తో మూవీ గురించి స్పందించారు. ప్రస్తుతం 'F3' సినిమాతో బిజీగా ఉన్న ఆయన.. ఆ తర్వాత బాలకృష్ణతో ఒక సినిమా చేయనున్నానని తెలిపారు. అలాగే మహేష్ కి ఒక స్టొరీ చెప్పానని.. ఆయనకు స్టొరీ బాగా నచ్చిందని అన్నారు. అయితే, మహేష్ ఇతర కమిట్ మెంట్స్ వల్ల ఈ ప్రాజక్టు పట్టాలెక్కడానికి కొంత సమయం పడుతుంది అని చెప్పుకొచ్చారు.
కాగా మహేష్ ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నాడు. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
![]() |
![]() |